https://oktelugu.com/

దుబ్బాక ప్రచారానికి పవన్‌..? బీజేపీకి లాభిస్తుందా..?

తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రచారంలో పోటీ పడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ నుంచి సోలిపేట రామలింగారెడ్డి సతీమణి బరిలో ఉండగా.. బీజేపీ నుంచి రఘునందన్‌రావు పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా సుజాత గెలుపుకోసం టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలంతా దుబ్బాకలో తిష్ఠ వేశారు. హరీశ్‌రావు బాధ్యతలు తీసుకొని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు రాష్ట్ర బీజేపీ సైతం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఇక్కడ బీజేపీ సీటు సాధించాలని పట్టుబడుతోంది. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 12:18 pm
    Follow us on

    తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రచారంలో పోటీ పడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ నుంచి సోలిపేట రామలింగారెడ్డి సతీమణి బరిలో ఉండగా.. బీజేపీ నుంచి రఘునందన్‌రావు పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా సుజాత గెలుపుకోసం టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలంతా దుబ్బాకలో తిష్ఠ వేశారు. హరీశ్‌రావు బాధ్యతలు తీసుకొని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు రాష్ట్ర బీజేపీ సైతం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఇక్కడ బీజేపీ సీటు సాధించాలని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌తో పాటు ఇతర నాయకులంతా దుబ్బాకలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.

    Also Read: జగన్ లేఖ: జడ్జీలపై నాటి సీఎంల లేఖలు.. ఏం జరిగిందంటే?

    బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దుబ్బాకలో పర్యటించి ప్రచారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీకి స్టార్‌ క్యాంపెయిన్‌గా పవన్‌ను రంగంలోకి దించితే కొంత లాభిస్తుందని పార్టీ వర్గాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అటు పవన్‌ సైతం బీజేపీ తరుపున దుబ్బాకలో ప్రచారం చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా పవన్‌తో ప్రచారం చేయించాలని రాష్ట్ర బీజేపీ ప్రణాళిక వేస్తోంది.

    పవన్‌ కొన్ని రోజులుగా రాజకీయాలకు దూర దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తున్నాడు. రాజకీయంగా ఏదైనా కార్యక్రమం చేద్దామన్నా పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో దుబ్బాక ప్రచారంలో తాను ఎంట్రీ ఇస్తే కొంత పబ్లిసిటీ కూడా పనికొస్తుందని కొందరు చర్చించుకుంటున్నారు. పవన్‌తో రాజకీయంగా లాభిస్తుందో లేదో గానీ తన ఘాటు వ్యాఖ్యలతో ప్రజల్లో కొంత ఉత్సాహం నింపినట్లవుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

    Also Read: టీడీపీకి గడ్డుకాలం లోకేశ్‌తోనేనా..?

    టీఆర్‌ఎస్‌కు ప్రతిష్ఠాత్మకంగా ఉన్న ఈ నియోజకవర్గంలో పవన్‌ పర్యటించినా ఎలాంటి మార్పు ఉండదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రజలు అభివృద్ధి చూసి ఓటేస్తారు గానీ.. స్టార్‌ క్యాంపెయిన్లను కాదని టీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శిస్తున్నారు. మరోవైపు ఒకప్పుటు కేసీఆర్‌తో భేటీలు నిర్వహించిన పవన్‌ మరి ప్రస్తుతం దుబ్బాకలో బీజేపీ తరుపున ప్రచారం చేస్తాడా..? లేదా..? అన్న చర్చ సాగుతోంది.