Janasena-TDP Alliance: గతంలో పవన్‌కు, ఇప్పటి పవన్‌కు చాలా తేడా ఉందండోయ్. గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారంటే ఆయన స్పీచ్ లో ఎక్కువగా మనకు ఆవేశమే కనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు.. దెబ్బలు తగిలి రాటు దేలిన సింహంలా మారిపోయారు. తాను చెప్పాలనుకున్నది సుతిమెత్తగా సుష్పష్టంగా చెప్పేస్తున్నారు. ఇందుకు నిన్న జరిగిన ఆవిర్భావ సభ నిర్వహణలో ఆయన మాటలే నిదర్శనం.
నిన్న ఆయన మాటల్లో కొన్ని విషయాలపై చాలా క్లారిటీగా మాట్లాడారు. ముఖ్యంగా టీడీపీతో పొత్తుపై ఇన్ డైరెక్టుగా క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు వన్ సైడ్ లవ్ మీద ఇప్పటి వరకు స్పందించని పవన్.. నిన్న తన స్పీచ్ లో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చబోమని చెప్పారు. దాన్ని బట్టి టీడీపీతో పొత్తుకు రెడీ అని అర్థమైపోతోంది. దీంతో టీడీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో అధికారమే లక్ష్యంగా పార్టీల ప్లాన్లు?
పైగా రాజధాని విషయంలో కూడా టీడీపీ నినాదమే వినిపించారు పవన్. రాజు మారినంత మాత్రాన రాజధాని మారకూడదు కదా అన్నట్టు చురకలు అంటించారు. ఈ మాటలు వైసీపీ మంత్రులకు టెన్షన్ పెట్టేస్తున్నాయి. వెంటనే పేర్ని నాని రంగంలోకి దిగి పవన్ మీద కౌంటర్ అటాక్ చేశారు. ఇక అభిమానుల అరుపులపై కూడా ఆలోచనాత్మకంగా కౌంటర్ వేశారు.
అరుపులు వద్దని, బాధ్యతగా ఉండాలంటూ సుతిమెత్తగా చురకలు అంటించారు. మీరు ఎంత బాధ్యతతో ఉంటే మనం అంత బలంగా తయారవుతామంటూ చెప్పారు. దీంతో పవన్ లో వచ్చిన ఈ మార్పు అందరినీ ఆకట్టుకుంటోంది. పైగా సభా నిర్వహణకు స్థలాలు ఇచ్చిన ఇప్పటం గ్రామానికి రూ.50లక్షల విరాళం ప్రకటించారు.
ఇలా అన్ని రకాలుగా పవన్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ స్పీచ్ తోని టీడీపీలో కొత్త జోష్ మొదలయింది. పవన్ తమకు అతిపెద్ద ఆస్తిగా మారబోతున్నాడని టీడీపీ నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి పవన్ మున్ముందు ఎలాంటి రాజకీయాలు చేస్తారో.
Also Read: వెంటపడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను వేటాడుతున్న కేసీఆర్!