https://oktelugu.com/

Ram Gopal Varma Tweet On The Kashmir Files Movie: పేలుడు పదార్థాలు కంటే ఎక్కువగా ఫైర్ అయ్యాడు

Ram Gopal Varma Tweet On The Kashmir Files Movie: రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్ కి విడదీయరాని సంబంధం ఉంది. అందుకే, వర్మను ‘ట్విట్టర్ వర్మ’ అని పిలుస్తున్నారు ఈ మధ్య. ఒక విధంగా ఆర్జీవీ సినిమాలకు ట్విట్టరే ప్రధాన పెట్టుబడి. ఇక ఆయనకు వివాదమే ఎంటర్ టైన్మెంట్. అందుకే, ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే, ఒక్కోసారి ఆర్జీవీ నుంచి వినూత్న ట్వీట్లు కూడా వస్తుంటాయి. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 15, 2022 / 04:02 PM IST
    Follow us on

    Ram Gopal Varma Tweet On The Kashmir Files Movie: రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్ కి విడదీయరాని సంబంధం ఉంది. అందుకే, వర్మను ‘ట్విట్టర్ వర్మ’ అని పిలుస్తున్నారు ఈ మధ్య. ఒక విధంగా ఆర్జీవీ సినిమాలకు ట్విట్టరే ప్రధాన పెట్టుబడి. ఇక ఆయనకు వివాదమే ఎంటర్ టైన్మెంట్. అందుకే, ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే, ఒక్కోసారి ఆర్జీవీ నుంచి వినూత్న ట్వీట్లు కూడా వస్తుంటాయి.

    Ram Gopal Varma

    తాజాగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ మూవీ పై ఆర్జీవీ స్పందిస్తూ.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాతో పేలుడు పదార్థాలు కంటే ఎక్కువగా ఫైర్ అయ్యారు అన్ని మెసేజ్ చేశాడు. ఈ సినిమాతో బాలీవుడ్‌ ని తొక్కేసి కొత్తగా వివేక్ వుడ్‌ ని స్థాపించినట్టే’ అని కూడా వర్మ ట్వీట్ చేయడం విశేషం.

    Also Read:  ‘వైల్డ్ ఫైట్స్ – యాక్షన్ ఎలిమెంట్స్’ మధ్యలో మెగా ప్రిన్స్

    కొత్త సినిమా దర్శక నిర్మాతలకి స్ఫూర్తిగా నిలిచాడు వివేక్ అంటూ ఆర్జీవీ మెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో గొప్ప టాలెంట్ ఉన్న వర్మ ఇలా ఒక డైరెక్టర్ ను పొగుడుతూ ట్వీట్ చేయడం చాలా అరుదు. అయినా, వర్మ ఎవరి గురించి ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడతాడో, ఎవరిని ఎప్పుడు బ్యాడ్ గా ప్రమోట్ చేస్తాడో వర్మకే తెలియదు.

    అందుకే, వర్మ గొంతు చించుకుని ఎవరి ఎన్ని చెప్పినా ఈ మధ్య ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో వర్మ ఆశించే పబ్లిసిటీ ఆ స్థాయిలో ఆర్జీవీకి దొరకడం లేదు. అందుకే.. కాస్త వర్మ ఈ మధ్య ఆలోచించి ట్వీట్స్ చేస్తున్నాడు. అయితే, వర్మ వ్యక్తిత్వం గురించి ఓ సినిమాలో ఒక డైలాగ్ ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

    ఒక చెట్టు మీద మామిడి కాయ ఉంది. చెట్టు కింద ఒకడు దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. పైన పండు వదిలేసి కింద వేరే దేని కోసమో వెతుకుతున్నాడు పిచ్చోడు అని అందరూ అనుకుంటారు. కానీ వాడు ఆ పండుని కొట్టడానికి రాయి కోసం వెతుకుతున్నాడు.

    The Kashmir Files Movie

    కరెక్ట్ గా చెప్పుకుంటే ఇలాంటి పరిస్థితే ఆర్జీవీది కూడా. దారిన పోయే వారి కన్నా ఎంతో క్లారిటీ గా, ఫోకస్డ్ గా తనకు కావాల్సిన పని చేసుకుంటూ పోతున్నాడు ఆర్జీవీ. అంతేగాని, దారిన పోయే దానయ్యలను, లేక పని చేసుకునే పాపయ్యలను ఆర్జీవీ పట్టించుకోడు. ఏది ఏమైనా ఆర్జీవీ గత వైభవం తిరిగి రానట్టే. అయితే, ఆర్జీవీ సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు, కానీ ఆర్జీవీ ఎప్పుడు సక్సెసే.

    Also Read:  ‘బాహుబలి 3’లో ఎన్టీఆర్.. ఏ పాత్రలో నటిస్తున్నాడు అంటే ?

    Tags