AP Cabinet Expansion: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. ఏపీ కేబినెట్ లో ప్రక్షాళనకు జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఉగాది తర్వాత మార్పు ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ ఉగాది నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త మంత్రులతో పాలన ప్రారంభించబోతున్నారు జగన్. అంతకుముందు 27వ తేదీన మంత్రులతో రాజీనామా చేయించేందుకు రెడీ అవుతున్నారు.
అయితే ఇప్పుడు ఉన్న మంత్రుల్లో ఐదుగురిని మాత్రం కొనసాగించనున్నట్లు సమాచారం. కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కన్నబాబు లేదా పేర్నినానిలో ఎవరినో ఒకరిని కొనసాగించేందుకు జగన్ సమాయత్తమవుతున్నారు. కాగా కొత్తగా తీసుకునే వారిని మాత్రం గతంలో పాటించిన సమీకరణాల ప్రాతిపదికగానే పదవులు ఇవ్వనున్నారు. మహిళకే హోం శాఖ ఇస్తారు. ఐదు సామాజిక వర్గాల నుంచి ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని తెలుస్తోంది. రాజీనామా చేయబోయే మంత్రుల్లో ఏ వర్గానికి చెందిన వారికి ఎన్ని పదవులు ఉన్నాయో మళ్లీ ఆ వర్గానికి అన్ని పదవులు జగన్ కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది.
Also Read: వెంటపడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను వేటాడుతున్న కేసీఆర్!
ఇక మూడు రీజియన్ల నుంచి ముగ్గురు మహిళా మంత్రులు ఉండనున్నట్లు సమాచారం. అటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకు ఉన్న మంత్రుల సంఖ్య ఆధారంగానే మళ్లీ తీసుకోనున్నారు. కాగా మంత్రుల పక్షాలనలో కేవలం సామాజిక వర్గాల ఆధారంగానే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్డిలకు కొత్త వారిలో నలుగురిని అవకాశం ఇస్తారని, బీసీ, ఇతర సామాజిక వర్గాల్లో మాత్రం ఇప్పటివరకు మంత్రి పదవి దక్కని కులాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది.
ఇక ఈ రోజు జరిగే ఎమ్మెల్సీ సమావేశంలో జగన్ ఈ విషయాన్ని అధికారికంగా చెప్పే అవకాశం ఉంది. మంత్రి పదవి తీసేసిన వారికి కొత్త జిల్లాల అధ్యక్ష పదవులు ఇవ్వనున్నారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు రాజ్యసభ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జగన్ వ్యూహాన్ని చూస్తుంటే.. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నట్లు అర్థమవుతోంది.
కొనసాగించే వారిలో ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నారు. అయితే కొత్తగా తీసుకునేవారిలో ఈసారి కాపు వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని టాక్ ఉంది. ఈ మూడు వర్గాలను తన గుప్పిట్లో పెట్టుకుంటే మరో సారి అధికారం ఖాయమనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. కాగా అనగారిన వర్గాలకు మాత్రం ప్రక్షాళనలో అన్యాయమే జరుగుతోంది అని చాలామంది అంటున్నారు చూడాలి మరి జగన్ ఎవరికి పెద్దపీట వేస్తారో.
Also Read: పునీత్ రాజ్ కుమార్ పేరు మీద రహదారి