అధికార పార్టీకి అయితే ఒకలా మరో పార్టీకి అనుకూలంగా ఉంటే మరోలా పక్షపాతం చూపడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా హీరో కావడంతో అభిమానం చూపితే నేరమా అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. తాజా పరిణామాలతో రాష్ర్టంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రస్తుతం రాష్ర్టంలో కులాల పరంగా అన్ని పనులు సాగుతున్నాయి. అన్ని పోస్టుల్లో కూడా కులాలదే ఆధిప్యతం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఒక హీరో జన్మదిన వేడుకలకు హాజరైతే తప్పేంటని చెబుతున్నారు. పోలీస్ శాఖపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులే రాజకీయంగా కామెంట్లు చేస్తుండడంతో విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. వారు చేసింది ఏదో నేరమైనట్లు వారిపై చర్యలు తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటే అందులో నేరమేముందని అడుగుతున్నారు. సినిమా పరంగా ఆయనపై ఉన్న అభిమానంతోనే తాము వేడుకలకు హాజరయ్యామే కానీ వేరే ఉద్దేశం లేదని చెబుతున్నా వారి మాటలు పట్టించుకోవడం లేదు. అదేదో పెద్ద నేరంగా పరిగణిస్తూ వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రాధాన్యం చూపడం చర్చనీయాంశం అవుతోంది. అధికార పార్టీ అయితే ఒక తీరుగా ప్రతిపక్ష పార్టీ అయితే మరో తీరుగా వ్యవహరించడం సరికాదని ప్రతిపక్షాలు సైతం గొంతు విప్పుతున్నాయి.