https://oktelugu.com/

Cheating lady: ఏపీ క్రైమ్ లేడీ కిల్లర్ కథ..

Cheating lady: ఆడవాళ్లకు దొంగతనం అచ్చిరాదంటారు. కానీ ఆమె దొంగతనంలో ఆరితేరింది. చోరకళలో నిపుణురాలైంది. చేయికి పనిచెబితే అంతే నగలు మాయం కావాల్సిందే. స్కెచ్ వేసిందంటే చాలు వారి జేబు గుళ్ల కావాల్సిందే. ఈ కిలాడీ లేడీ (Cheating lady) కథ వింటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు 20 కేసుల్లో శిక్ష అనుభవించి మళ్లీ దొంగనాలనే నమ్ముకుంది. పక్కా ప్రణాళికతో ఎదుటి వారిని బురిడీ కొట్టించి అందినకాడికి దోచుకుంటుంది. కొన్ని సార్లు సింగిల్ గా ఒక్కోసారి […]

Written By: , Updated On : September 4, 2021 / 12:54 PM IST
Follow us on

Cheating lady in VisakhapatnamCheating lady: ఆడవాళ్లకు దొంగతనం అచ్చిరాదంటారు. కానీ ఆమె దొంగతనంలో ఆరితేరింది. చోరకళలో నిపుణురాలైంది. చేయికి పనిచెబితే అంతే నగలు మాయం కావాల్సిందే. స్కెచ్ వేసిందంటే చాలు వారి జేబు గుళ్ల కావాల్సిందే. ఈ కిలాడీ లేడీ (Cheating lady) కథ వింటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు 20 కేసుల్లో శిక్ష అనుభవించి మళ్లీ దొంగనాలనే నమ్ముకుంది. పక్కా ప్రణాళికతో ఎదుటి వారిని బురిడీ కొట్టించి అందినకాడికి దోచుకుంటుంది. కొన్ని సార్లు సింగిల్ గా ఒక్కోసారి గ్రూపుగాను రంగంలోకి దిగి తన పని కానిచ్చేస్తుంది. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి తన చేతికి పని చెబుతుంది.

విశాఖ జిల్లా (Vishakapatnam district) కేంద్రంలోని 202 కాలనీ నుంచి కొత్తవలస మీదుగా గంటా తులసి ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. ఆమె కంట్లో పడిన వారిని మాటల్లో దించి తన పని పూర్తి చేస్తుంది. దిగి పోయిన తరువాత కాని వారికి తెలియదు తమ బంగారు నగలు మాయమైనట్టు తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తారు. వీరి మోసాలకు అంతే లేకుండా పోతోంది. అందినకాడికి దోచుకుంటూ ప్రయాణికులను బెంబేలెత్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు భయం పట్టుకుంది. ప్రయాణం చేయాలంటేనే ముందుకు రావడం లేదు.

తులసి తాజాగా గత నెల 26న చినముషిడివాడకు చెందిన దేవి అనే మహిళ నెక్లెస్ మరమ్మతు చేయించుకుని తిరిగి ఇంటికి వెళుతోంది. గోపాలపట్నం నుంచి పెందుర్తి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. పెందుర్తిలో ఆటో దిగిన తరువాత 15 గ్రాముల బంగారు నెక్లెస్ మాయమైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తులసిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

గతంలో సైతం తులసి ఇలాంటి నేరాలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించింది. కానీ ఆమెలో మార్పు లేదు. మళ్లీ అవే దొంగతనాలు చేస్తూ తన వైఖరి మార్చుకోవడం లేదు. ఎప్పుడు చోరీలకు పాల్పడుతూ అప్పుడప్పుడు అరెస్టు అవుతూ తన దొంగ బుద్ధి చూపెడుతోంది. పదేపదే నేరాలు చేస్తూ అరెస్టవుతూ ఉంటుందని క్రైం డీసీపీ సురేష్ బాబు వెల్లడించారు. కానీ ఈసారి మాత్రం ఆమెపై డీసీ షీట్ ఓపెన్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.