
Pavan Kalyan Encouraging Talent: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ లో స్నేహితుల సంఖ్య చాలా తక్కువే..కానీ ఒక్కసారి ఒకరిని నమ్మితే మాత్రం ఆయన తన సోల్ మెట్ గా ట్రీట్ చేస్తాడు, అలా ఇండస్ట్రీ లో ఆయన సోల్ మెట్ గా ట్రీట్ చేసిన వ్యక్తులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వారిలో కమెడియన్ అలీ కూడా ఒకరు..మొదటి సినిమా మినహా, రెండవ సినిమా నుండి కాటంరాయుడు వరకు అలీ లేనిదే సినిమాలు చేసేవాడు కాదు పవన్ కళ్యాణ్.
ఎన్నో సందర్భాలలో అలీ తో తనకి ఉన్న అనుబంధం గురించి చెప్పుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్.కానీ 2019 వ సంవత్సరం లో అలీ కి పవన్ కళ్యాణ్ కి మధ్య రాజకీయం అడ్డుపడింది.అలీ జనసేన పార్టీ లో చేరకుండా , వైసీపీ పార్టీ లో చేరడం, పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తపరచడం వంటివి మన అందరం చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను చెయ్యబోతున్న తదుపరి చిత్రాలలో అలీ కి ఏమాత్రం చోటు లేకుండా చేస్తున్నాడు. ఆయన స్థానం లోకి ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ని బాగా ప్రోత్సహిస్తున్నాడు పవన్ కళ్యాణ్.ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఒక ముఖ్య పాత్రని ఇచ్చాడు.అంతే కాదు, ఈ సినిమాలో వచ్చే కొన్ని కామిక్ సన్నివేశాలకు హైపర్ ఆది చేత డైలాగ్స్ రాయించే అరుదైన అవకాశం కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్.మొదటి నుండి టాలెంటెడ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న హైపర్ ఆదిని, ఈ స్థాయిలో గుర్తించి పైకి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ పై అభిమానులు మరియు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం లో కూడా హైపర్ ఆదికి ఛాన్స్ దక్కింది.రాబొయ్యే పవన్ కళ్యాణ్ సినిమాలన్నిటికీ కూడా హైపర్ ఆది ఇక డిఫాల్ట్ గా ఉండబోతున్నాడు.ఒకప్పుడు అలీ లేని పవన్ కళ్యాణ్ సినిమాలు ఉండేవి కాదు, ఇక నుండి కూడా హైపర్ ఆది లేని పవన్ కళ్యాణ్ సినిమాలు ఉండబోవని అంటున్నారు విశ్లేషకులు.