
Hero Become a Director: టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి పేరు ఇప్పుుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు అవార్డు దక్కడంతో ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. దీంతో రాజమౌళి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో రాజమౌళి పర్సనల్ విషయాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో జక్కన్న కు సంబంధించిన ఓ హాట్ న్యూస్ సినీ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. రాజమౌళి హీరోగా మారే ఛాన్స్ ఉండేదట. కానీ ఆయన డైరెక్షన్ వైపు వెళ్లాడని అంటున్నారు. ఎం.ఎం.కీరవాణి తండ్రి శివశక్తి దత్తా ఓ ఇంటర్యూలో రాజమౌళి గురించి ఆసక్తి విషయాలు బయటపెట్టారు.

‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో డైరెక్టర్ గా మారిన రాజమౌళి ఆ తరువాత ఎన్నో సక్సెస్ మూవీస్ తీశారు. రామ్ చరణ్ తో తీసిన ‘మగధీర’తో ఆయన లెవన్ నేషనల్ కు వెళ్లింది. ఇక అప్పటి నుంచి పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. బాహుబలి సినిమాలతో ఈ లెవల్ వరల్డ్ వైడ్ కు వెళ్లి జక్కన్న బిగ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తరువాత ఆయన తీసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఏకంగా ఆస్కార్ అవార్డునే దక్కించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం అని అంటున్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి పర్సనల్ విషయాల గురించి చర్చించుకుంటున్నరు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన రాజమౌళి ఆ తరువాత హైదరబాద్ షీప్ట్ అయ్యారు. రాజమౌళి కుటుంబం మొదటి నుంచి సినిమాల్లోనే కొనసాగుతోంది. అయితే తమ కుటుంబంలో హీరో అయ్యే చాన్స్ ఎవరికీ లేదని అప్పుడే అనుకున్నారట. కానీ రాజమౌళిని చూశాక శివశక్తి దత్తా మాత్రం తనను హీరో కావాలని సూచించాడట. ఒక సందర్భంగా రాజమౌళి దగ్గరికి వెళ్లి నువ్వు హీరోగా ట్రై చెయ్యి అని అడగగా.. చిరునవ్వి నవ్వి వెళ్లిపోయాడట.
ఆ తరువాత తనకు హీరో అవడం ఇష్టం లేదని పరోక్షంగా పలు సార్లు చెప్పాడట. ఇక అప్పటి నుంచి ఎవరూ హీరో కోసం ట్రై చేయడం లేదట. రీసెంట్లీగా ఎంఎంకీరవాణి కుమారుడు హీరోగా ట్రై చేసినా వర్కౌట్ కావడం లేదు. దీంతో శివశక్తి దత్తా మాట్లాడుతూ మా కుటుంబంలో హీరోగా రాణించే అవకాశం లేదని టెక్నీషియన్ గా రాణిస్తారని అన్నాడట. అందుకేనేమో రాజమౌళి డైరెక్టర్ గా మారి సంచలన సినిమాలు బయటపెట్టారు. లేకుంటే సాధారణ హీరోగా రాజమౌళిని మనం చూడాల్సి వచ్చేది కావొచ్చు.
Also Read: RRR – BRS – BJP: ఆర్‌ఆర్‌ఆర్‌కు ప్రాంతీయ ముద్ర.. బీజేపీపై బీఆర్‌ఎస్ కుట్ర కరెక్టేనా!?