Homeఆంధ్రప్రదేశ్‌పంచాయతీ పోరులో తేలిన పార్టీ బలాబలాలు..: తిరుపతి సీటును బీజేపీ త్యాగం చేసేనా..!

పంచాయతీ పోరులో తేలిన పార్టీ బలాబలాలు..: తిరుపతి సీటును బీజేపీ త్యాగం చేసేనా..!

tirupati by-elections
మరికొద్ది రోజుల్లో ఏపీలో మరో బై ఎలక్షన్‌ జరగబోతోంది. తిరుపతి లోక్‌సభ స్థానానికి ఈ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ స్థానాన్ని అన్ని పార్టీలూ ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని మళ్లీ తమ ఖాతాలోనే వేసుకోవాలని వైసీపీ ఆరాటపడుతుండగా.. ఇక్కడ గెలిచి వైసీపీ కి చెక్‌ పెట్టాలని టీడీపీ భావిస్తోంది. అంతేకాదు.. మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేనలు సైతం ఈ సీటునే టార్గెట్‌ చేశాయి. అయితే..ఈ రెండు పార్టీల్లో క్యాండిడేట్‌ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అంతేకాదు.. అసలు ఈ స్థానం నుంచి ఏ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపాలా అనే పంచాయతీ కూడా ఇద్దరి మధ్య నడుస్తోంది.

Also Read: ఏపీలో పంచాయతీ పోరు సక్సెస్..‘నిమ్మగడ్డ’ గెలిచినట్లేనా..?

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతల్లో ముగిశాయి. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో ఏ పార్టీ బలం ఎంతో తేలిపోయింది. అధికార, ప్రతిపక్షాలను పక్కన పెడితే బీజేపీ, జనసేనల్లో ఎవరి బలం ఏంటనే విషయమై క్లారిటీ వచ్చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న తాము.. ఏపీలో అధికారం చేపట్టడానికి ఒక్క ఓటు దూరంలో ఉన్నామని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే.. ఆ ఒక్క ఓటు వారికి అందడం లేదు. చాలా దూరంలో ఉండిపోతోంది. కానీ.. జనసేనకు మాత్రం చాలా దగ్గరగా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేదు. పట్టుమని పది పంచాయతీల్లో కూడా తమ మద్దతుదారులను గెలిపించుకోలేకపోయింది.

ఏపీ బీజేపీలో తాము పెద్ద తోపు, తురుం లీడర్లమని చెప్పుకునే వారికి కొదవ లేదు. కానీ.. వారికి స్వగ్రామాల్లోనే వారికి పట్టు లేదని తాజాగా మరోసారి తేలిపోయింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తమ స్వగ్రామంలో గెలిపించుకోలేకపోయారు. అదే సమయంలో బీజేపీకి వలస నేతల బలం కొన్ని చోట్ల కలిసి వచ్చింది. గత ఎన్నికల తర్వాత భద్రత భయంతో టీడీపీని వీడి బీజేపీలో కొంత మంది నేతలు చేరారు. వారి గ్రామాల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలొచ్చాయి. సీఎం రమేష్ స్వగ్రామం పొట్లదుర్తిలో బీజేపీ అభ్యర్థి మంచి ఆధిక్యంతో గెలిచారు. ఇవి మినహా పెద్దగా సాధించిందేమీ లేదు.

Also Read: ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. కొత్త పద్ధతిలో పరీక్షలు..?

కానీ.. జనసేన పరిస్థితి అలా కాదు. కింది స్థాయిలో తనకు బేస్ ఉందని ఈ ఎన్నికల ద్వారా నిరూపించుకోగలిగింది. బీజేపీతో పోలిస్తే.. జనసేన బలం పదిరెట్లు ఎక్కువని తేలింది. అందుకే.. ఇప్పుడు అందరూ తిరుపతి ఉపఎన్నికలో జనసేన పోటీ చేస్తుందా.. బీజేపీ పోటీ చేస్తుందా అన్న చర్చకు వెళ్తున్నారు. బలంపై క్లారిటీ వచ్చింది కాబట్టి.. బీజేపీ కూడా రియలైజ్ అవుతుందని జనసేన నమ్ముతోంది. తమ అభ్యర్థికే పోటీ చేసే చాన్స్ ఇస్తారని ఆశిస్తోంది. కానీ.. బీజేపీ అంత సామాన్యంగా ఒప్పుకుంటుందా..? అనే సందిగ్ధత కూడా కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version