తిరుపతి చేరుకున్న టీడీపీ వ్యూహకర్త

తిరుపతి లోక్‌సభ బై పోల్‌ ఇంకా నోటిఫికేషన్‌ రాకముందే టీడీపీ గ్రౌండ్‌ వర్క్‌ మొదలు పెట్టేసింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈ ఉప ఎన్నికను ఎదుర్కోబోతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ఓడించాలని గట్టి నిర్ణయంతో ఉంది టీడీపీ. అందుకే.. వేరే కార్యకలాపాలేమీ పెట్టుకోకుండా చంద్రబాబు సమయాన్నంతా తిరుపతికే కేటాయిస్తున్నారు. అయితే.. ఆయన ఈ ఎన్నిక బాధ్యతను ప్రధానంగా ఓ వ్యూహకర్తకు అప్పగించారట. ఆయనే రాబిన్ శర్మ. Also Read: అలిగినోళ్లందరికీ పార్టీ పదవులు..: […]

Written By: Srinivas, Updated On : December 26, 2020 12:31 pm
Follow us on


తిరుపతి లోక్‌సభ బై పోల్‌ ఇంకా నోటిఫికేషన్‌ రాకముందే టీడీపీ గ్రౌండ్‌ వర్క్‌ మొదలు పెట్టేసింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈ ఉప ఎన్నికను ఎదుర్కోబోతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ఓడించాలని గట్టి నిర్ణయంతో ఉంది టీడీపీ. అందుకే.. వేరే కార్యకలాపాలేమీ పెట్టుకోకుండా చంద్రబాబు సమయాన్నంతా తిరుపతికే కేటాయిస్తున్నారు. అయితే.. ఆయన ఈ ఎన్నిక బాధ్యతను ప్రధానంగా ఓ వ్యూహకర్తకు అప్పగించారట. ఆయనే రాబిన్ శర్మ.

Also Read: అలిగినోళ్లందరికీ పార్టీ పదవులు..: అసంతృప్తులకు కాంగ్రెస్‌ బుజ్జగింపులు

గతంలో పీకే టీంలో కీలకంగా పనిచేసి తర్వాత సొంత సంస్థ పెట్టుకున్నారు రాబిన్‌ శర్మ. ఈ మేరకు టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. ఆయన పార్టీ స్ట్రాటజీని ఖరారు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రచార వ్యూహాలను భిన్నంగా ఎంచుకుంటున్నారు. ఇప్పటికీ ఐటీడీపీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. అలాగే.. ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించుకున్నారు. రాబిన్ శర్మ కొద్ది రోజులపాటు తిరుపతిలో మకాం వేసి.. పరిస్థితులపై అవగాహన తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఐటీడీపీ ప్రచార సరళి ఎలా ఉండాలనే అంశంపై ఒక వ్యూహం సిద్ధం చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన వైసీపీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. వీటితోపాటు చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు, చేస్తున్న అన్యాయాలను కూడా సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయాలని నిర్ణయించారు. టీటీడీ పవిత్రతను మంటగలిపే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఇసుక, లిక్కర్ మాఫియా దందా, దళితులు, మైనార్టీలపై దాడులు వంటి ప్రధాన అంశాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

Also Read: సంచలనం.. కరోనాను జయించిన ‘ధారవి’..!

అయితే.. రాబిన్ శర్మ టీం కూడా కొన్ని బృందాలను నియమించుకుంది. వారందరూ తిరుపతి చేరుకున్నారు. ఆ టీమ్‌లు తమ పనిని ప్రారంభించాయి. మరోవైపు ఇప్పటికే పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసిన చంద్రబాబు.. పార్టీ పరంగా క్షేత్ర స్థాయి వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించారు. బూత్, మండల, అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిల్లో కమిటీలను నియమించారు. బూత్ స్థాయిలో 8 వేల మంది కార్యకర్తలను రంగంలోకి దించారు. గ్రామ స్థాయిలో వెయ్యి మంది తమ పని మొదలుపెట్టారు. మండలస్థాయిలో 40 మంది నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. 89 మంది పరిశీలకులను నియమించారు. మొత్తంగా తిరుపతి బరిలో గెలుపొంది మరోసారి టీడీపీ ప్రాభవాన్ని చాటాలని చూస్తున్నారు చంద్రబాబు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్