Homeజాతీయ వార్తలుషర్మిలను పార్టీలు అందుకే పట్టించుకోవడం లేదా..!

షర్మిలను పార్టీలు అందుకే పట్టించుకోవడం లేదా..!

YS Sharmila
ఖమ్మం గడ్డ మీద బహిరంగ సభ నిర్వహించిన వైఎస్‌ షర్మిల.. తెలంగాణ వేదికగా పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించారు. పార్టీ జెండా.. ఎజెండాలను.. పార్టీ పేరును వైఎస్సార్‌‌ జయంతి అయిన జూలై 8న ప్రకటించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్న షర్మిల.. మిగిలిన ఈ టైమ్‌లో ఆ వర్క్‌ను పూర్తిస్థాయిలో కంప్లీట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే.. ఖమ్మంలో బహిరంగ నిర్వహించిన షర్మిల ఆద్యంతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీదనే విమర్శలు ఎక్కుపెట్టారు.అంతే కాదు.. తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆమె సభపై రాజకీయవర్గాలు సైతం ఓ కన్నేశాయి. ప్రజల నుంచి వస్తున్న స్పందనను గ్రహించారు. వీరు అనుకున్నంత స్థాయిలో అక్కడ సీన్‌ లేకపోవడంతో అందరూ సైలెంట్‌ అయిపోయారు. షర్మిల సభలో కొంతమంది రాజకీయ నేతలను టార్గెట్‌ చేసి వ్యక్తగతంగా వ్యాఖ్యలు చేసినా.. ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు.

కేసీఆర్‌‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు.. తెలంగాణ సాధించాక వచ్చింది ఏంటంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు.. తన తండ్రి జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్లను కాదని రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం కమీషన్ల కోసమే ఇదంతా చేశారని దుయ్యబట్టారు. అయితే.. సాధారణంగా ఏ పార్టీ నుంచి అయినా అలాంటి విమర్శలకు రివర్స్‌ అటాక్‌ ఇచ్చవారు టీఆర్‌‌ఎస్‌ నేతలు. దూకుడుగా రిప్లైలు వచ్చేవి. కానీ.. ఆమె వ్యాఖ్యలపై అనవసరంగా స్పందించి.. ఆ పార్టీకి హైప్‌ తేవాల్సిన అవసరం లేదని అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఇదే సమాచారాన్ని కిందిస్థాయి లీడర్ల వరకూ పంపించారు. షర్మిల పార్టీ వషయంలో అనవసరంగా ఆవేశపడాల్సిన అవసరం లేదని తేల్చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలెవరూ నోరు మెదపలేదు. కాంగ్రెస్ కూడా అంతే.. బీజేపీ కూడా సేమ్‌. అధికారికంగా స్పందించకూడదని నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్‌లో వీహెచ్, బీజేపీలో ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ మాత్రం స్పందించారు. కానీ.. వాటిని పార్టీ అభిప్రాయాలుగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. షర్మిల రాజకీయ అరంగేట్రం మొత్తంగా ఓ ఈవెంట్‌లాగా జరుగుతోందన్న అభిప్రాయ రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. కొత్తగా హైప్‌ క్రియేట్‌ చేసి ఆమెకు మైలేజ్‌ తీసుకురావాల్సిన పనిలేదని నిర్ణయానికి వచ్చారట. సభలో జనం కన్నా వాహనాలే ఎక్కువయ్యాయని అభిప్రాయం కూడా వారిలో కనిపిస్తోంది. అందుకే.. మొదట్లోనే ఆమె పార్టీ ఎలా ఉండబోతోందో అర్థమైపోయిందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఫలితంగా ఎవరి నోట వెంట కూడా షర్మిలను విమర్శిస్తూ వ్యాఖ్యలు వినిపించడం లేదు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version