Paritala Sunitha: తెలుగుదేశం పార్టీలో నిరసనలు మొదలయ్యాయి. ఒక్కొక్కరుగా తమ గళం విప్పుతున్నారు. అధినేత తీరులో మార్పు రావాలని ఆశిస్తున్నారు. టీడీపీపై వైసీపీ నేతలు చేస్తున్న ఆగడాలను తిప్పికొట్టే క్రమంలో బాబు కూడా దూకుడు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. వైసీపీ నేతల గొడవలపై మాజీ మంత్రి సునీత పెదవి విప్పారు. ఏపీలో జరుగుతున్న రగడపై తనదైన శైలిలో స్పందించారు. అలాగే మరో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సైతం మండిపడుతున్నారు. వైసీపీ నేతల బూతు పురాణంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

వైసీపీ నేతల చేష్టలు చూస్తుంటే టీడీపీ నేతలకు ఆగ్రహం పెరిగిపోతోంది. అడుగడుగునా అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు. దీంతో టీడీపీ నేతలు కూడా సరైన సమాధానాలు ఇచ్చే క్రమంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు కూడా ఒకే పార్టీ అధికారంలో ఉండదు. మరో పార్టీకి కూడా అధికారం చేతికి వస్తుంది. అప్పుడు ఇంతకు ఇంత రుణం తీర్చుకుంటామని టీడీపీ నేతలు బదులిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అన్నింటికి జవాబు చెబుతామంటున్నారు.
టీడీపీ నేతలు రాష్ర్టంలో సాగవుతున్న గంజాయి గురించి ప్రశ్నిస్తే తమ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాఫియాపై మాట్లాడితే మాపై దాడులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. వైసీపీ నేతల తీరుపై టీడీపీలో అందరిలో ఆగ్రహం పెల్లుబికుతోంది. రాష్ర్టంలో సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి పనుల ఊసే కనిపించడం లేదు.
అధినేత చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే చాలు పరిస్థితి చక్కబడుతుందని పరిటాల సునీత చెబుతున్నారు. మాలో ప్రవహిస్తున్నది సీమ రక్తమే. ప్రతీకారం తీర్చుకుంటాం. వైసీపీ నేతలపై సరైన విధంగా సమాధానం చెబుతామన్నారు. వైసీపీ నేతలకు పరోక్షంగా హెచ్చరిక చేశారు.