Samantha: నాగ చైతన్యతో విడాకుల తర్వాత తరచూ వార్తల్లో నిలుస్తోంది సమంత. అయితే అవేవీ పట్టించుకోకుండా జీవితంలో ముందుకు సాగుతోంది సామ్. వరుస సినిమాలకు ఓకే చెప్తూ… ఫుల్ బిజీగా గడుపుతంది. తాజాగా, శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత.. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. శాకుంతలం సినిమా అనుభావలతో పాటు, బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన విషయాలనూ ముచ్చటించింది.
తన సినిమా టీవీలో వస్తోందంటే చాలు వెంటనే టీవీ ఆపేస్తానని సామ్ చెప్పారు. తనను స్క్రీన్‌పై చూసుకుంటే తప్పులే కనిపిస్తాయని తెలిపారు. కెరీర్ ప్రారంభంలో సినిమాలపై ఉన్న భయం వల్ల కొత్త పాత్రలు, కథలపై ప్రయోగాలకు ఆసక్తి చూపలేకపోయినట్లు పేర్కొన్నారు. ఇప్పడు వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ రొటీన్‌గానే ఉన్నాయని.. అందుకే ఆ మూస ధోరణి నుంచి బయటికి వచ్చేందుకు ధైర్యంగా సవాళ్లను స్వీకరించడం అలవాటు చేసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్ గురించి మట్లాడుతూ.. తను అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఫ్యామిలీమ్యాన్ 2 కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు.
‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ విజయం బాలీవుడ్ సినిమాలు చేసేలా తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని సామ్ అన్నారు. అంతకు ముందు తనలో ఉన్న భయం వల్ల హిందీ సినిమా ఆఫర్లు వచ్చినా అంగీకరించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ భయాలేవీ లేవని స్పష్టం చేశారు. ఇకపై హీందీ సినిమాలో ఆఫర్లు వచ్చినా సిద్ధంగా ఉన్నానని అన్నారు.
కాగా చై-సామ్ విడాకులను అక్కినేని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వారి విడాకులకు కారణాం ఏమై ఉంటుందా అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సమంత వల్లే వారి దాపంత్యంలో మనస్పర్థలు వచ్చాయని, ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అభ్యంతరకర సన్నివేశాల్లో నటించడం, సామ్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండటం వల్లే వారిమధ్య బంధం బలహీనపడిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.