నిమ్మగడ్డ మెడకు ‘మేనిఫెస్టో’ పంచాయితీ

లోకల్‌ బాడీ ఎలక్షన్లకు రెడీ అవుతున్న టైమ్‌లో ఏపీ ఎలక్షన్‌ కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ ఓ పరీక్ష ఎదుర్కోబోతున్నారు. నిత్యం.. ఫలానా మంత్రుల వ్యాఖ్యలను పరిశీలిస్తున్నా.. విధులకు ఆటంకం కలిగేలా ప్రవర్తిస్తే కోర్టులకెళ్తా.. ఏకగ్రీవాల ప్రకటనలపై వివారణ కోరా అంటూ చెప్పుకొస్తున్న నిమ్మగడ్డ.. ఇప్పుడు బాబు చేసిన పనితో ఇబ్బందుల్లో పడినట్లుగా తెలుస్తోంది. పంచాయతీలకు పంచసూత్రాలంటూ చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్‌ చేశారు. దీంతో ఇప్పుడు అందరూ నిమ్మగడ్డని టార్గెట్ చేశారు. అసలు పార్టీ ప్రస్తావనే లేకుండా […]

Written By: Srinivas, Updated On : January 29, 2021 10:55 am
Follow us on


లోకల్‌ బాడీ ఎలక్షన్లకు రెడీ అవుతున్న టైమ్‌లో ఏపీ ఎలక్షన్‌ కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ ఓ పరీక్ష ఎదుర్కోబోతున్నారు. నిత్యం.. ఫలానా మంత్రుల వ్యాఖ్యలను పరిశీలిస్తున్నా.. విధులకు ఆటంకం కలిగేలా ప్రవర్తిస్తే కోర్టులకెళ్తా.. ఏకగ్రీవాల ప్రకటనలపై వివారణ కోరా అంటూ చెప్పుకొస్తున్న నిమ్మగడ్డ.. ఇప్పుడు బాబు చేసిన పనితో ఇబ్బందుల్లో పడినట్లుగా తెలుస్తోంది. పంచాయతీలకు పంచసూత్రాలంటూ చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్‌ చేశారు. దీంతో ఇప్పుడు అందరూ నిమ్మగడ్డని టార్గెట్ చేశారు. అసలు పార్టీ ప్రస్తావనే లేకుండా జరిగే ఎన్నికల్లో పార్టీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేయడం ఏంటని.. దానిపైనా తండ్రీ కొడుకుల బొమ్మలేంటి అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి లాజిక్ తీశారు. దమ్ముంటే టీడీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ సవాల్ విసిరారు.

Also Read: మెగాస్టార్‌‌ మద్దతూ మా కూటమికే..: సోము కీలక వ్యాఖ్యలు

అంబటితోపాటు.. అటు సోషల్ మీడియా మొత్తం నిమ్మగడ్డను టార్గెట్ చేసింది. ఏకగ్రీవాల నజరానాలు పెంచే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన పేపర్ ప్రకటనపై వివరణ కోరిన ఎస్ఈసీ.. ఇప్పుడు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఏ చర్య తీసుకుంటారని నిలదీస్తున్నారు. చంద్రబాబును వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా? అంటూ సవాల్ విసురుతున్నారు. నవరత్నాలు అనే కాన్సెప్ట్ జనాల్లోకి బాగా వెళ్లిపోవడంతో.. అదే టైప్‌లో ఇంకేదైనా మేజిక్ చేయాలని బాబు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగా తెరపైకి వచ్చిందే ‘పల్లె ప్రగతికి పంచసూత్రాలు’. ఓవైపు పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు సంబంధం లేదని చెబుతూనే ఉన్నా.. చంద్రబాబు ఆవేశంతో ఓ అడుగు ముందుకేశారు. ఐదు సూత్రాలను ప్రింట్ చేసి హడావిడి చేశారు.

ఇప్పుడు ఇది కాస్త సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతోంది. పంచాయతీ మేనిఫెస్టోతోపాటు, 2014లోని ఎన్నికల మేనిఫెస్టోను కూడా బయటపెట్టండి చూసి తరిస్తామంటూ నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. 2014 మేనిఫెస్టో అమలులో పూర్తిగా విఫలం అయిన టీడీపీ, ఇప్పుడా సమాచారం ఇంటర్నెట్‌లో లేకుండానే తొలగించేసింది. ఇక ఇప్పుడు పంచాయతీ మేనిఫెస్టో అంటూ కొత్త నాటకానికి తెరతీసింది. 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మేనిఫెస్టో తయారు చేసే అవకాశం తనకు ఉంటుందో లేదోనని బాబు ముందుగానే తొందరపడినట్లుగా తెలుస్తోంది. ఇవే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.

Also Read: చంద్రబాబును జగన్ ఎందుకు అంతలా కలవరిస్తున్నారు?

ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోపై ఎస్‌ఈసీ స్పందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కరోనా సాకుతో గతంలో ఎన్నికలను వాయిదా వేసినప్పటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చంద్రబాబు ఏజెంట్ అనే ముద్ర బలంగా పడిపోయింది. బీజేపీ నేతలను రహస్యంగా హోటల్ గదిలో కలసిన వేళ.. అది చెరగని కుల ముద్రగా మారింది. అయితే తాను అన్నిటికీ అతీతుడినని, రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం పాటుపడుతున్నానని, నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నానని అనడం ఆయనకు పరిపాటిగా మారింది. పదే పదే తన నిజాయితీని నిరూపించుకోవాలని చూస్తున్న నిమ్మగడ్డకు నిజంగా ఇది ఓ మంచి అవకాశంగా దొరికింది. నిమ్మగడ్డ శీల పరీక్షకు నిలబడాలంటే కచ్చితంగా చంద్రబాబు చర్యపై వివరణ కోరాల్సిందే. మరి ఏం చేస్తారో చూద్దాం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్