మనలో కొంతమంది ప్రతి చిన్న విషయానికి అవతలి వ్యక్తులపై కోపం, అసహనం ప్రదర్శిస్తూ ఉంటారు. చిన్నచిన్న విషయాలకు కూడా కోప్పడుతూ ఉంటారు. తరచూ కోపం రావడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోపం ఎక్కువగా వచ్చే వారిలో ఒత్తిడి పెరుగుతుందని.. ఎడ్రినలీన్ అనే కెమికల్ విడుదలవుతుందని నిద్రలేమి సమస్య ఉంటే కూడా కోపం ఎక్కువగా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: మెడ పట్టేసిందా.. నొప్పి నివారణకు పాటించాల్సిన చిట్కాలివే..?
సరిగ్గా నిద్రపోని వారిని ఈ సమస్య మరింత ఎక్కువగా వేధించే అవకాశం ఉంటుంది. ఏ కారణం వలనైనా సరిగ్గా నిద్రపోకపోతే ఓపిక లేకపోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం, విపరీతమైన కోపం రావడం జరుగుతుంది. నిద్ర తక్కువైతే మెదడులో ఉండే అమిగ్‌డాలా అనే కెమికల్ పనితనం తగ్గుతుందని.. వ్యాయాయం, మానసిక ప్రశాంతత, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యలను అధిగమించి కోపాన్ని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకుంటే కలిగే నష్టాలివే..?
కోపం ఎక్కువగా ఉంటే దీర్ఘ శ్వాస తీసుకోవాలని.. 1 నుంచి 100 వరకు నంబర్లను లెక్కించాలని.. చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సంగీతం వినడం ద్వారా కూడా కోపాన్ని తగ్గించుకోవచ్చని.. కోపం కలిగించే విషయాలను ఇతరులతో చర్చించడం వల్ల కూడా కోపం తగ్గుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. యోగా చేయడం ద్వారా కూడా కోపాన్ని అధిగమించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
చల్లటి నీటిని తాగడం ద్వారా, చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవడం ద్వారా కూడా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. జర్నల్ ఆఫ్ రీసెర్చ్ కోపానికి, నిద్రకు సంబంధం ఉన్నట్లు వెల్లడించింది. రోజుకు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు సంతృప్తికరమైన నిద్ర ఉంటే నిద్రలేమి సమస్యలను అధిగమించవచ్చు.