spot_img
Homeఆంధ్రప్రదేశ్‌లెక్క తేల్చిన పంచాయతీ ఎన్నికలు : ఆ ఎమ్మెల్యేల చూపు వైసీపీ వైపు

లెక్క తేల్చిన పంచాయతీ ఎన్నికలు : ఆ ఎమ్మెల్యేల చూపు వైసీపీ వైపు

YCP
భవిష్యత్‌ గురించి ఆలోచించే ప్రజలు ఎవరైనా ఏ ఎన్నికల్లోనైనా అధికార పార్టీకి జై కొడుతుంటారు. మిగితా పార్టీలు ఏవేవో భ్రమల్లో బతుకుతుంటాయి. అయితే.. ఏపీలో మొన్నటి పంచాయతీ ఎన్నికల్లోనూ సరిగా అదే జరిగింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియతో కొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఉన్న భ్రమలు తొలిగిపోయాయి. టీడీపీపై దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నవారికి కూడా 20 నెలల్లోనే ఓ మోస్తరుగా క్లారిటీ ఇచ్చేశారు జగన్.

Also Read: ‘పంచాయితీ’ గెలిచిన జనసేన.. మున్సిపోల్ లోనూ తొడగొడుతోంది!

పంచాయతీ ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో ఆ కొద్ది మంది ఎమ్మెల్యేలకు జ్ఞానోదయం కలిగించాయి. దాదాపు 80 శాతం పంచాయతీల్లో వైసీపీ జెండా ఎగరేసింది. చివరికి కాపాడుతుందనుకున్న అమరావతి ప్రాంతంలో కూడా ఎక్కువ పంచాయతీలు వైసీపీకే దక్కాయి. చంద్రబాబు సొంత ఇలాకా కుప్పం కూడా జగన్‌కు దాసోహం అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత, ఇక ఎప్పటికీ టీడీపీ అధికారంలోకి రాబోదు అనే విషయం రోజురోజుకూ స్పష్టం అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. టీడీపీకి గుడ్ బై చెప్పేసి జగన్‌కు మద్దతు తెలిపారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆ గట్టు నుంచి ఈ గట్టుకి వచ్చేశారు.175 మందిలో జగన్‌కు అపోజిషన్ కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అయితే వీరిలో కూడా ఇప్పుడు చాలామంది జగన్ వైపే చూస్తున్నారని సమాచారం.

‘పంచాయతీ ఎన్నికలతో వైసీపీపై ఉన్న వ్యతిరేకత బయటపడుతుంది. టీడీపీ బలం పుంజుకుంటుంది’ అంటూ చంద్రబాబు తన ఎమ్మెల్యేలను, నాయకుల్ని, కార్యకర్తల్ని భ్రమల్లోకి తోశారు. తీరా ఫలితాలు చూస్తే వారికి భ్రమలన్నీ తొలగిపోయి, జ్ఞానోదయం అయినట్టు తెలుస్తోంది. ఇంకా చంద్రబాబుని నమ్ముకొని సైకిల్ తొక్కుతూ కూర్చుంటే లాభం లేదని ఆలోచనకు వచ్చారు. దీంతో ఇప్పుడు మరోసారి వైసీపీ వైపు చూసే టీడీపీ బ్యాచ్ పెరిగింది. గంటా శ్రీనివాసరావు గోడమీద పిల్లిలా ఉన్నా విశాఖలో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి.

Also Read: గ్రేట్‌ సీఎం జగన్‌ : ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌

టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లని కూడా అనుమానించాల్సిన సమయం ఇది. కరణం బలరాం వంటి నమ్మినబంటే బాబుని వదిలేశారంటే.. మిగతావారికి భ్రమలు తొలగిపోవడం పెద్ద కష్టమేమీ కాదు. రేపల్లె, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పంచాయతీ ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోవాలని గతంలోనే ఫిక్స్ అయ్యారు. ఫలితాలు దారుణంగా వచ్చే సరికి మరో ఆలోచన లేకుండా జగన్‌కు జై కొట్టాలనుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలోనే మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటారని తెలుస్తోంది. ఈ లాంఛనం కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోపే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే చంద్రబాబు ఉన్న ఆ కాస్త ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదమే ఉంది. వైసీపీ మరింత బలపడనుంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper