తిరుపతి సీటు బీజేపీకా.? జనసేనకా? ‘పంచాయతీ’ తేల్చేసింది..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక.. ఆ పార్టీకి కొంత ఊపొచ్చింది. దీంతో అదే ఊపుతో పంచాయతీ ఎన్నికలకు వెళ్లారు. ప్రభుత్వం ఓవైపు పంచాయతీ ఎన్నికలను విమర్శిస్తుంటే.. బీజేపీ కూడా టీడీపీకి వంతపాడింది. ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టుబట్టింది. దీంతో ఎట్టకేలకు మొదటి విడత ఎన్నికలు ముగిశాయి. కానీ.. ఏంలాభం ఎక్కడా బీజేపీ తన సత్తా చాటలేకపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మూడు వేల పంచాయతీల్లో మూడంటే మూడు పంచాయతీల్లోనే […]

Written By: Srinivas, Updated On : February 11, 2021 11:56 am
Follow us on


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక.. ఆ పార్టీకి కొంత ఊపొచ్చింది. దీంతో అదే ఊపుతో పంచాయతీ ఎన్నికలకు వెళ్లారు. ప్రభుత్వం ఓవైపు పంచాయతీ ఎన్నికలను విమర్శిస్తుంటే.. బీజేపీ కూడా టీడీపీకి వంతపాడింది. ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టుబట్టింది. దీంతో ఎట్టకేలకు మొదటి విడత ఎన్నికలు ముగిశాయి. కానీ.. ఏంలాభం ఎక్కడా బీజేపీ తన సత్తా చాటలేకపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మూడు వేల పంచాయతీల్లో మూడంటే మూడు పంచాయతీల్లోనే గెలిచింది.

Also Read: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బోల్తా

దీంతో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటా అనేది మరోసారి తేటతెల్లమైంది. స్టేట్ పార్టీలోని కొందరు లీడర్లు మీడియా ముందుకు వచ్చి చెలరేగిపోయిన వారు ఉన్నారు. కానీ.. వారి ఊళ్లలోనే బీజేపీకి ఓట్లు పడకపోవడం గమనార్హం. చివరికి సోము వీర్రాజు స్వగ్రామంలోనూ బీజేపీ అభ్యర్థి గెలిచిన దాఖలాలు లేవు. ఒకప్పుడు.. ఆయన తన స్వగ్రామంలో వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయారు.

అటు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ ప్రధాన పార్టీలతో పోటీ పడకపోవచ్చు. కానీ.. కొన్నిచోట్ల తన బలాన్ని చాటింది. దాదాపుగా 28 గ్రామాల్లో జనసేన అభ్యర్థులు సర్పంచ్ స్థానాలను గెల్చుకున్నారు. వీటిలో అత్యధికం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. బీజేపీ కంటే తన పార్టీనే బలమైందని నిరూపించగలిగారు.

Also Read: బ్రేకింగ్: టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా ఈమెనే.. ఆ సీనియర్ నేత కుమార్తెకు కేసీఆర్ అవకాశం

అయితే.. ఇప్పుడు సర్వత్రా ఓ అంశం తెరపైకి వచ్చింది. అదే తిరుపతి పార్లమెంట్‌ సీటు. పంచాయతీ ఎన్నికల్లోనే సత్తా చాటలేకపోయిన బీజేపీ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలా గెలవగలుగుతుందని జనసేన సైనికులు అంటున్నారు. జనసేన పోటీ చేస్తేనే ఇంతో ఇంతో పోటీ పడటానికి చాన్స్ ఉంటుందని ఇట్టే అర్థమవుతోంది. కానీ.. ఇప్పటికే ఆ సీటు బీజేపీకే కావాలని ఆ పార్టీ లీడర్లు పట్టుబడుతున్నారు. అమిత్ షా దగ్గరి నుంచి జేపీ నడ్డా వరకూ.. అందరితోనూ పవన్ కల్యాణ్‌కు ఓ మాట చెప్పిస్తున్నారు. దాంతో పవన్ కల్యాణ్ కరిగిపోతున్నారు. బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందంటూ.. ఆయన కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నారు. కానీ.. జనసేన పార్టీకి జరుగుతున్న నష్టాన్ని మాత్రం ఆయన అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌ కల్యాణ్‌ మరోసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్