https://oktelugu.com/

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఫిక్స్.. ప్రభాస్ తర్వాత ఈ మూవీనే

మరో టాలీవుడ్ బ్రేకింగ్ బయటపడింది. ఇన్నాళ్లు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తో ఓ మూవీ చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని పక్కనపెట్టి ‘ప్రభాస్’తో ‘సలార్’ స్ట్రాట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా షాక్ అయ్యారు. తమ హీరోతో కేజీఎఫ్ దర్శకుడి సినిమా లేదా అని కంగారుపడ్డారు. అయితే తాజాగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఉప్పెన’ మూవీ ప్రమోషన్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 11, 2021 / 12:00 PM IST
    Follow us on

    మరో టాలీవుడ్ బ్రేకింగ్ బయటపడింది. ఇన్నాళ్లు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తో ఓ మూవీ చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని పక్కనపెట్టి ‘ప్రభాస్’తో ‘సలార్’ స్ట్రాట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా షాక్ అయ్యారు. తమ హీరోతో కేజీఎఫ్ దర్శకుడి సినిమా లేదా అని కంగారుపడ్డారు.

    అయితే తాజాగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఉప్పెన’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతు నవీన్, రవిశంకర్ లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ తదుపరి ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ తో అంటూ సంచలన విషయం చెప్పారు.

    కేజీఎఫ్ తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్ ’ తర్వాత తారక్ తో ఓ సినిమా చేయనున్నారంటూ ఎప్పటి నుంచి వార్తలు వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ప్రభాస్ ‘సలార్ ’ తర్వాత ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తమ బ్యానర్ పై సినిమా ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ గ్యాప్ లో ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రానికి ఓకే చేశాడు. ఈ రెండూ పూర్తయ్యాక ప్రశాంత్-ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కనుంది.