ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేసేందుకు ఐడీబీఐ బ్యాంక్ సిద్ధమైంది. ఐడీబీఐ బ్యాంక్ 23 పార్ట్ టైమ్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 20వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు..?
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. https://www.idbibank.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో కొంతమంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికవుతారు. ఆఫ్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 20వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆయిన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు..?
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంబీబీఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, పీజీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు పనిలో అనుభవం ఉండాలి. దరఖాస్తులను స్క్రుటినైజ్ చేసి అర్హులైన వారిని మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హత ఉన్న డాక్టర్లు సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి సూచించిన చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా జనరల్ మేనేజర్, ఐడీబీఐ బ్యాంక్, 21వ అంతస్తు, ఐడీబీఐ బ్యాంక్ టవర్, కోలబ, ముంబయి – 400005 అడ్రస్ కు దరఖాస్తులను పంపాలి. ఐడీబీఐ బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు భారీ వేతనం పొందవచ్చు.