
మరికొద్ది రోజుల్లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఇక్కడ పోటీకి అన్ని పార్టీలూ సై అంటున్నాయి.బీజేపీ ఇటీవల నియామకం అయిన కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తమ పార్టీ బరిలో ఉంటుందని స్పష్టం చేశాడు. దీంతో ఈ ఉప ఎన్నిక సెగ ఇప్పుడు అన్ని పార్టీలకూ చేరింది. అయితే ఇప్పుడు ఆసక్తి అంతా టికెట్ ఎవరికి కేటాయిస్తారా అని.
Also Read: అప్పుడే లోకేష్ కు లీడర్ల ఝలక్
బీజేపీ ఈసారి తిరుపతి పార్లమెంట్ తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకే ఆ దిశగా కసరత్తులు ప్రారంభించింది. అయితే.. ఇప్పుడంతా టికెట్ ఎవరికి దొరుకుతుందా అనే చర్చ నడుస్తోంది ఆ పార్టీలో. ఇప్పటి వరకైతే బీజేపీలో ఆసక్తి చూపుతున్న గట్టి అభ్యర్థి ఒకరే ఉన్నారు. కాకపోతే తొందరలోనే పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేత కూడా టికెట్ పై కన్నేసినట్లు సమాచారం. దాంతో పోటీ చేయటం కోసమే సదరు నేత తొందరలో కమలం కండువా కప్పుకుంటారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమేతే ఇద్దరిలో టికెట్ ఎవరికి అన్నదె అర్థం కావటం లేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు ఈమధ్య చనిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి ఉపఎన్నికలు జరపక తప్పదు. అందుకనే ఉపఎన్నికల్లో పోటీ చేయటానికి పార్టీలు అభ్యర్థులను రెడీ చేసుకుంటున్నాయి. ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటూ అందరికన్నా ముందు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. నిజానికి ఇక్కడ పోటీ చేసే గెలిచేంత సీన్ బీజేపీకి లేదన్న విషయం అందరికీ తెలుసు. అయితే జనసేన నుంచి ఈమధ్య బీజేపీలో చేరిన మాజీమంత్రి రావెల కిషోర్ బాబు పోటీ చేసే విషయంలో బాగా ఆసక్తిగా ఉన్నారట.
Also Read: జేడీయూ, బీజేపీల మధ్య పోస్టర్ వివాదం..! మిత్రబంధం చెడిందా..?
మరి ఆయన అభ్యర్ధిత్వంపై పార్టీ నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియకుండా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత పనబాక లక్ష్మి టీడీపీకి రాజీనామా చేసేసి కమలం కండువా కప్పుకోబోతున్నట్లు తెలిసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి పనబాక క్లోజ్ ఫ్రెండ్. దీంతో పనబాక బీజేపీలో చేరి తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయటానికి దాదాపు లైన్ క్లియర్ అయిపోయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.