https://oktelugu.com/

సైకిల్ దిగనున్న పనబాక?

టీడీపీ నుంచి పలువురు నేతలు వెళ్లిపోతున్నారు. పార్టీలో భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే వలసలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. స్థానికి సంస్థల ఎన్నికల్లో పార్టీ పరాభవం చెందడంతో నేతలు మనసు మార్చుకుంటున్నారు. రాజకీయ ఎదుగుదల కోసం పార్టీని వీడి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే కోవలో తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఘోర పరాజయం పాలైన పనబాకల లక్ష్మి కూడా ఉన్నారు. ఆమె సైతం సైకిల్ దిగేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. 2019 […]

Written By: , Updated On : May 26, 2021 / 10:48 AM IST
Follow us on

lakshmi
టీడీపీ నుంచి పలువురు నేతలు వెళ్లిపోతున్నారు. పార్టీలో భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే వలసలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. స్థానికి సంస్థల ఎన్నికల్లో పార్టీ పరాభవం చెందడంతో నేతలు మనసు మార్చుకుంటున్నారు. రాజకీయ ఎదుగుదల కోసం పార్టీని వీడి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే కోవలో తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఘోర పరాజయం పాలైన పనబాకల లక్ష్మి కూడా ఉన్నారు. ఆమె సైతం సైకిల్ దిగేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు అయిష్టంగా టీడీపీలో చేరిన లక్ష్మి తిరుపతిలో ఓటమి పాలు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.

తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందన్న ఆశతో నేతలు పార్టీలో చేేారు. తీరా తెలిశాక పార్టీ భవితవ్యం గందరగోళంలో పడిందన్న విషయం తెలిసి ఏం చేయలేని పరిస్థితి. మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామంటే ఏ మాత్రం కలిసిరాని తిరుపతి పార్లమెంట్ బరిలో ఉన్నా ఓడిపోక తప్పదనే విషయం తెలుస్తోంది. పనబాక లక్ష్మికి ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తే సరిపోయేది. అలా కాకుండా సానుభూతి పనిచేస్తుందని భావించి ఆమెనే మళ్లీ బలిపశువును చేశారు.

తిరుపతి పోరులో లోకేష్ ప్రతిష్ట ఇనుమడింపజేయడానికే ప్రచారం జరిగింది కానీ తన విజయం కోసం కాదని తెలుస్తోంది. అటు అధిష్టానం, ఇటు నేతలు ఎవరు మనసు పె ట్టి పనిచేయలేదని పనబాక ఆవేదన వ్యక్తం చేశారు. పనకబాకకు నెల్లూరు జిల్లాలో కాస్తో కూస్తో మిగిలిచిన అనుచరులు సైతం టీడీపీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందని చెప్పడంతో టీడీపీ వైపు మొగ్గు చూపారు. గతంలో వైసీపీ ఆఫర్ మిస్ చేసుకున్న ఆమె తిరిగి వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.

జగన్ నుంచి ఆహ్వానం అందితే వైసీపీ కండువా వేసుకునేందుకు వనబాక సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. పార్టీలో కొందరు ఎస్సీ ఎమ్మెల్యేలు మాత్రం ఆమె విషయంలో సుముఖంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం పనబాక ఎటు వైపు మొగ్గుతారో వేచి చూడాల్సిందే. సైకిల్ దిగేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.