తీరం దాటిన ‘యాస్’.. అప్రమత్తమైన ఒడిశా, బెంగాల్

  బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏర్పడిన ‘యాస్’ తుఫాన్ రానున్న 12 గంటల్లో అతి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా ఒడిశా వైపునకు దూసుకొస్తోంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వస్తున్న ‘యాస్’ బుధవారం ఉత్తర ఒడిశా – బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు […]

Written By: NARESH, Updated On : May 26, 2021 11:05 am
Follow us on

 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏర్పడిన ‘యాస్’ తుఫాన్ రానున్న 12 గంటల్లో అతి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా ఒడిశా వైపునకు దూసుకొస్తోంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వస్తున్న ‘యాస్’ బుధవారం ఉత్తర ఒడిశా – బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

ఒడిశాలోని పారాదీప్ కు 220 కిలోమీటర్ల దూరంలో, బాలా సోర్ కు ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో ‘యాస్’ కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై సహాయక బృందాలను తరలించింది.

ఇక బెంగాల్, ఒడిశా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ లు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే బెంగాల్ లోని 9 లక్షల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో 2 లక్షల మందిని సేఫ్ జోన్లో ఉంచారు. ఒక వేళ భారీ వర్షాలు పడితే సహయం అందించడానికి ఆయా జిల్లాల అధికారులను అలర్ట్ చేశారు.

‘యాస్’ తుఫాను ప్రభావం ఏపీపై కూడా ఉంది. విశాఖ, గంగవరం, మచిలీపట్నం, కృష్ణ పట్నం తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. సంబంధిత జిల్లాల అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. అధికారులు సేవలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక యాస్ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను, మరి కొన్ని ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.