Pakistan’s Sindhu CM Posts: పాకిస్తాన్ సీఎం హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు.. పోస్ట్ వైరల్

Pakistan’s Sindhu CM Posts: పాకిస్తాన్.. మతతత్వ దేశం. ఆ దేశంలో ఇతర మతస్థులకు స్వేచ్ఛ సమానత్వాలు అస్సలే ఉండవు. ముఖ్యంగా మనల్ని శత్రువులుగా చూసే పాకిస్తాన్ లో హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతుంటాయి. హిందుత్వాన్ని అస్సలే ఒప్పుకోరు. అలాంటి పాకిస్తాన్ లో ఏకంగా దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు ఓ సీఎం. అంతేకాదు పండుగను చేసుకున్నారట.. ఇదిప్పుడు వైరల్ గా మారింది.. వివాదాస్పదం కూడా అయ్యింది.. పాకిస్తాన్ లోని మన పంజాబ్ రాష్ట్రానికి సరిహద్దున […]

Written By: NARESH, Updated On : November 5, 2021 6:50 pm
Follow us on

Pakistan’s Sindhu CM Posts: పాకిస్తాన్.. మతతత్వ దేశం. ఆ దేశంలో ఇతర మతస్థులకు స్వేచ్ఛ సమానత్వాలు అస్సలే ఉండవు. ముఖ్యంగా మనల్ని శత్రువులుగా చూసే పాకిస్తాన్ లో హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతుంటాయి. హిందుత్వాన్ని అస్సలే ఒప్పుకోరు. అలాంటి పాకిస్తాన్ లో ఏకంగా దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు ఓ సీఎం. అంతేకాదు పండుగను చేసుకున్నారట.. ఇదిప్పుడు వైరల్ గా మారింది.. వివాదాస్పదం కూడా అయ్యింది..

PAK_min_gaffe

పాకిస్తాన్ లోని మన పంజాబ్ రాష్ట్రానికి సరిహద్దున ఉండే సింధ్ రాష్ట్ర సీఎం సయ్యద్ మురాద్ అలీ షా తాజాగా దీపావళి సందర్భంగా హిందూ సమాజానికి ‘హ్యాపీ హోలీ’ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచంలోని పలువురు నాయకులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు చెబుతూ వారి సోషల్ మీడియా ఖాతాలలో దీపావళి సందేశాలను పోస్ట్ చేశారు. అయితే పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ పై అందరి దృష్టి పడింది.

దీపావళి పండుగ గురించి సందేశం లేదా ఫొటోను పోస్ట్ చేయడానికి బదులు.. మురాద్ అలీ షా హోలీ రంగులతో ఉన్న ఫొటోషాప్ చేసిన తన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది అక్కడి పాకిస్తానీలు, ముస్లింలలో ఆగ్రహాన్ని తెప్పించింది. ఆయనపై అందరూ మండిపడడంతో ట్వీట్ తొలగించాడు. అయితే చాలామంది నెటిజన్లు వెంటనే దీన్ని స్క్రీన్ షాట్ లు తీసి వైరల్ చేశారు. పాకిస్తానీ జర్నలిస్ట్ ముర్తాజా సోలంగి కూడా ఈ ఫొటోను షేర్ చేశారు.

అయితే సింధ్ రాష్ట్ర సీఎం చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. పాకిస్తాన్ లో హిందువులు అధికసంఖ్యలో ఉన్నరాష్ట్రంగా సింధ్ కు పేరుంది. ఇక్కడ హిందువులు కూడా సీఎం అయిన సందర్భాలున్నాయి. సో సీఎం మురాద్ చేసిన పనిని మతకోణంలో చూడవద్దని కొందరు హితవు పలుకుతున్నారు.