Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో సీనియర్ నటుడు విజయచందర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఆయన పాత్ర హీరో తండ్రి పాత్ర. అంటే.. హీరోని చిన్నతనం నుంచి పెంచే పాత్ర అట. పైగా విజయచందర్ ది సినిమాలోనే వెరీ ఎమోషనల్ రోల్ అని, ఇంటర్వెల్ లో ఆయన పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. మొత్తమ్మీద ఏభై ఏళ్ల సినిమా జీవితంలో ఇది మర్చిపోలేని పాత్ర అట.

అందుకే, ఈ సినిమా కోసం విజయచందర్ ప్రత్యేకమైన కేర్ తీసుకుని మరీ తన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఆయన పాత్ర ప్లాష్ బ్యాక్ ను ఎలివేట్ చేస్తూ ఒక పాట పాడాల్సి ఉంటుందట, ఆ పాటలో చాలా డెప్త్ ఉంటుందట. ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న షెడ్యూల్ లో విజయచందర్ కు సంబంధించిన కీలక సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటించడానికి అంగీకరించాడు. అలాగే యంగ్ హీరో సత్యదేవ్ తో పాటు మరో మలయాళ హీరో సురేష్ గోపి కూడా నటిస్తున్నాడు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ నటిస్తే.. ఈ సినిమా పై బాలీవుడ్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా అనసూయ నటించబోతుంది.
నిజానికి ఈ సినిమాలో హీరో చెల్లి పాత్ర చాలా కీలకం. మలయాళ వెర్షన్ లో ‘మంజు వార్యర్’ ఈ పాత్రను అద్భుతంగా నటించింది. పాత్ర కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అందుకే, తెలుగు వర్షన్ లో ఈ పాత్ర కోసం చాలామంది పేర్లను అనుకున్నారు. ఓ దశలో బాలీవుడ్ నటి ‘విద్యా బాలన్’ నటించబోతున్నట్లు కూడా టాక్ నడిచింది.
అసలు మొదట సుహాసిని అన్నారు, ఆ తర్వాత రోజా పేరు కూడా వినిపించింది. కానీ చివరకు అనసూయను ఫైనల్ చేశారు. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ వెరీ స్టైలిష్ గా నటించబోతున్నారు, అందుకే ఈ చిత్రం పై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
Also Read: Actor Surya: పునీత్ సమాధి వద్ద హీరో సూర్య ఏం చేశాడో తెలుసా…