Gautham Vasudev Menon: ఆ సినిమా గురించి నాకు తెలీదు అంటున్న డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్…

Gautham Vasudev Menon: ప్రేమకధ చిత్రాలను తనదైన స్టైల్లో తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. తన సినిమాలలో ఏదైనా ఒక పాత్రతో అప్పుడప్పుడు అలరించే గౌతమ్… గత కొద్ది సంవత్సరాలుగా డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ లోనూ రాణిస్తున్నారు.  తన సినిమాలతో పాటు వేరే సినిమాల్లో కూడా గౌతమ్ యాక్టింగ్ అద్భుతంగా చేస్తున్నారు. ఆయన నటనకు గాను పలు సినిమాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొద్దిరోజుల క్రితం తమిళంలో గౌతమ్ మీనన్ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 5, 2021 6:41 pm
Follow us on

Gautham Vasudev Menon: ప్రేమకధ చిత్రాలను తనదైన స్టైల్లో తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. తన సినిమాలలో ఏదైనా ఒక పాత్రతో అప్పుడప్పుడు అలరించే గౌతమ్… గత కొద్ది సంవత్సరాలుగా డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ లోనూ రాణిస్తున్నారు.  తన సినిమాలతో పాటు వేరే సినిమాల్లో కూడా గౌతమ్ యాక్టింగ్ అద్భుతంగా చేస్తున్నారు. ఆయన నటనకు గాను పలు సినిమాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొద్దిరోజుల క్రితం తమిళంలో గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రలో “అన్బు సెల్వ‌న్” అనే చిత్రాన్ని ప్రకటించారు.

అయితే తాజాగా నిన్న దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ని ఛీత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో గౌతమ్  పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పోస్టర్ పై గౌత‌మ్ మీన‌న్ చేసిన కామెంట్లు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ సినిమా పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… ఈ సినిమా గురించి నాకు తెలీదు. ఇది నాకు ఆశ్చ‌ర్యం క‌లిగించే వార్త‌ ఇది. ఈ సినిమాలో ఎలా న‌టిస్తున్నానో తెలియ‌దు. ఈ పోస్ట‌ర్ లో ఉన్న డైరెక్ట‌ర్ ఎవ‌రో నాకు తెలియ‌దు… ఆ డైరెక్ట‌ర్ ను నేను క‌లువ‌లేదు. నిర్మాత‌లు ట్వీట్ చేయ‌డానికి పెద్ద పేర్ల‌ను వాడుకున్నారు. ఇది షాకింగ్‌గా ఉంది అంత సుల‌భంగా ఇలా ఎలా చేస్తారో భ‌యంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు గౌత‌మ్ మీన‌న్.

ఇప్పుడు ఈ స్టార్ డైరెక్ట‌ర్ చేసిన కామెంట్లు తమిళ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కామెంట్ల పై చిత్ర నిర్మాణ సంస్థ ఎంఎం స్టూడియోస్ స్పందించింది. తన యూట్యూబ్ ఛానెల్ లో కౌంటర్ గా చిత్రానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను విడుదల చేసింది. ఈ వీడియో క్లిప్ లో వివేక్, ప్రసన్నతో పాటు గౌతమ్ నటించిన‌ట్టు ఉంది. అయితే ఈ వీడియో క్లిప్ పై గౌతమ్ మీనన్ స్పందించాల్సి ఉంది.