Pakistan Vs India: పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ పై భారత్ అన్ని విధాలుగా విరుచుకుపడుతోంది. ఏ విషయంలోనూ ఉదారత చూపించడం లేదు. ఇప్పటికే దిగుమతుల విషయంలో ఎర్ర జెండా ఊపింది. ఇక నౌకల విషయంలోనూ అదే తీరును ప్రదర్శిస్తోంది. వాఘా సరిహద్దును పూర్తిగా మూసివేసింది. ఇక వచ్చే రోజుల్లో అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయంగా ఈ దేశం కూడా పాకిస్తాన్ కు రూపాయి కూడా అప్పు ఇవ్వకుండా చేస్తోంది. మొత్తంగా చూస్తుంటే పాకిస్తాన్ దేశానికి భారత్ క్రొకోడైల్ ఫెస్టివల్ చూపిస్తోంది.
Also Read: ‘కూలీ’ టీజర్: రజినీకాంత్ విజిల్ సౌండ్ పాన్ ఇండియాలో వినిపిస్తుందా..?
నిఘా వర్గాలు ఏమంటున్నాయి అంటే..
భారత్ ఎన్ని విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ.. అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడినప్పటికీ.. పాకిస్తాన్ దేశానికి టర్కీ, కొన్ని అరబ్ దేశాల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. పాకిస్తాన్ అనేది ఉగ్రవాద దేశం. అక్కడ అన్నపానీయాల కంటే ఆయుధాలే ఎక్కువగా లభిస్తాయి. పైగా ఉగ్రవాద తండాలకు పాకిస్తాన్ నెలవు కాబట్టి.. పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేస్తే ఉగ్రవాదులకు ఇబ్బంది కాబట్టి.. యుద్ధంలో నేరుగా వారే పాల్గొనవచ్చు. పైగా పాకిస్తాన్లో అణు బాంబులు ఉన్నాయి. ఒకవేళ భారత్ కనక పాకిస్తాన్ పై యుద్ధం మొదలుపెడితే.. దాయాది పాకిస్తాన్ హైదరాబాద్, విశాఖపట్నం నగరాలను టార్గెట్ చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ దేశంలోనే అత్యంత కీలకమైన నగరం. పైగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది గ్లోబల్ డెస్టినేషన్ గా ఉంది. ఇక విశాఖపట్నం నగరంలో నౌక దళ స్థావరం ఉంది. అందువల్లే కేంద్ర నిఘా వర్గాలు సమాచారం అందించడంతో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని సివిల్ డిఫెన్స్ జిల్లాగా గుర్తించింది. ముందుగా వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని భద్రతా దళాలకు సూచించింది. మరోవైపు హైదరాబాదు నగరంలో గతంలో అనేక సందర్భాల్లో ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. నాడు జరిగిన ఆ దాడులు హైదరాబాద్ నగరాన్ని కకా వికలం చేశాయి. నాటి ఘటనల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిగా క్షతగాత్రులు అయ్యారు. నేటికీ ఆ ఘటనలను తలుచుకుంటే హైదరాబాద్ నగర్ వాసులు వణికి పోతారు. ఇక అప్పటినుంచి హైదరాబాద్ ఇప్పటివరకు ప్రశాంతంగా ఉంది. మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే భద్రతను కట్టుదిట్టం చేయాలని బలగాలకు కేంద్ర నిఘావర్గాలు సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అభివృద్ధిలో భారతదేశంలో పోటీ పడలేని పాకిస్తాన్.. భారతదేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఎంతటి దారుణానికైనా ఒడి కడుతుందని.. అలాంటప్పుడు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సూచిస్తున్నారు. పాకిస్తాన్ దేశం అనేది ఉగ్రవాద దేశమని.. దానితో జాగ్రత్తగా ఉండాలని హితవు పలుకుతున్నారు.