Imran Khan: పాకిస్తాన్ లో పరిణామాలు మారుతున్నాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కష్టాలు తప్పేలా లేవు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్ ను ఇరుకునపెట్టే విధంగా తీర్పు ఇవ్వడం సంచలనం కలిగిస్తోంది. ఇటీవల ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తూ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఏప్రిల్ 9న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించడంతో ఇమ్రాన్ ఖాన్ కు గండం ఎదురు కానుందని తెలుస్తోంది.

అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ శక్తులున్నాయనే కోణంలో ఏప్రిల్ 3న చేపట్టే అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తీసుకున్న నిర్ణయం సరైంది కాదని సుప్రీంకోర్టు తేల్చింది. దీంతో ఇక ఇమ్రాన్ ఖాన్ కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఇమ్రాన్ కు పదవీ గండం తప్పనిసరి అని తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆయనను పదవీచ్యుతుడిని చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read: One Chance: ఒక్క ఛాన్స్.. ఏపీని ‘అంధకారం’ దిశగా తీసుకెళుతుందా?
మొదటి నుంచి ఇమ్రాన్ ఖాన్ ఇందులో విదేశీ శక్తుల హస్తం ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఖాసిం సూరి కూడా వంత పాడారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ అవసరం లేదని రద్దు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇక అవిశ్వాసం పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది.

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సూచన మేరకు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి అసెంబ్లీని రద్దు చేశారు. మెజార్టీ కోల్పోయిన ఇమ్రాన్ కు నాలుగు రోజులైనా గడవకముందే సుప్రీంకోర్టు తీర్పు ఇరుకున పెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కోర్టు లోపల బయట పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. పాక్ లో జరుగుతున్న పరిణామాలపై భారత్ కూడా ఓ కన్నేసింది. అదంతా వారి వ్యక్తిగత వ్యవహారమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Also Read:Maarisetty Raghavaiah: జనసేన వ్యూహకర్త మారిశెట్టి రాఘవయ్య బీజేపీ లో చేరిక!
[…] IPL 2022: ఐపీఎల్ సీజన్లో కి ఈసారి కొత్త జట్లు రెండు వచ్చాయి. ఇవి రావడం ఏంటో గానీ.. టాప్ జట్లకు శాపంగా మారిపోయాయి. గత సీజన్లలో బలమైన జట్లుగా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లకు వరుసగా షాక్ ఇస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాయి. […]