Alia Bhatt In Hollywood: బాలీవుడ్ బ్యూటీ, ఇటీవలే గంగూబాయ్‌తో సూపర్ హిట్ అందుకున్న అలియా భట్ హాలీవుడ్‌లోకి ఎంటరవబోతోంది. ఇప్పటికే RRR చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకీ పరిచయమైన అలియా, హాలీవుడ్‌లో వండర్ వుమన్‌గా పేరుపోయిన గాల్ గాడట్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. హార్ట్ ఆఫ్ స్టోన్ పేరుతో వీరిద్దరూ కలిసి ఓ స్పై చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తుండగా, తెలుగులోనూ చూడొచ్చు.

అన్నట్టు అలియా భట్ కూడా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎవరు ఇష్టమని ఓ యాంకర్ ప్రశ్నించగా, కొద్దిసేపు ఆలోచించిన అలియా సమంత పేరు చెప్పుకొచ్చింది. సామ్ ఒప్పుకుంటే ఆమెతో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమని, ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ నటనకు తాను ఫిదా అయ్యానని, అవకాశం వస్తే ఆమెతో కలిసి థ్రిల్లర్ సినిమా చేయాలనుకుంటున్నా అని ఆలియా చెప్పుకొచ్చింది.
Also Read: అరె.. ఎంతో ఓపికగా అందరికీ పంచి పెట్టింది
మొత్తానికి తెలుగు స్టార్ట్స్ పై క్రేజీ కామెంట్స్ చేస్తోంది. తెలుగు నటీనటులతో కలిసి నటించాలని ఉంది అంటూ కబుర్లు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పనిచేయడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు కూడా చెప్పింది. ‘నన్ను ఇంట్లో ఆలూ అని పిలుస్తారు. పుష్ప సినిమా చూసిన నా కుటుంబ సభ్యులు, ఆలూ.. అల్లుతో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్?’ అని ఆటపట్టిస్తున్నారని వెల్లడించింది.

మొత్తానికి ఆలియా, మొహమాటం లేకుండా బన్నీతో సినిమా చేయాలని ఉందని ఓపెన్ అయ్యింది. ఆల్ రెడీ ఈ బ్యూటీ ఎన్టీఆర్‌తో మరో సినిమాలో నటించనుంది. ఎన్టీఆర్ ఫై కూడా అనేక పాజిటివ్ కామెంట్స్ చేసింది. ఏది ఏమైనా అలియాకి లౌక్యం ఎక్కువ అని నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.
Also Read: బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ లో వున్నది వీరే..!
[…] Also Read: హాలీవుడ్‌లో కూడా నటిస్తోన్న క్రేజీ బ… […]