Pakistan National Assembly Dissolved: పాకిస్తాన్ ప్రధానమంత్రిపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా పోయింది. దీంతో పాక్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదివరకు కూడా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండా నిలిచిపోయిన సంఘటనలున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా చేసుకుని పదవీ గండం నుంచి గట్టెక్కారు.
తరువాత జరిగే ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీంతో తాత్కాలికంగా పదవి దక్కించుకున్నా ఎన్నికల్లో గెలిచి తన ప్రభావం చూపించాలని సూచిస్తున్నారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది పరిస్థితి. అవిశ్వాస తీర్మానానికి విదేశీ శక్తులు కుట్ర పన్నాయనే ఉద్దేశంతోనే దాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని విపక్ష నాయకుడు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. రాజ్యాంగాన్ని రక్షించడానికే ఇమ్రాన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దేశంలో నైతిక విలువలు తగ్గించే పనిలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ చర్యలు ఉంటున్నాయని విమర్శించారు. దీంతో దేశంలో ప్రభుత్వం పడిపోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికా కుట్రతోనే ఇవన్నీ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా దురుద్దేశపూర్వకంగా తనపై కుట్ర చేస్తోందని దుయ్యబడుతున్నారు. అమెరికా కుట్రను వమ్ము చేసేందుకే ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ లో చోటుచేసుకుంటున్న రాజకీయాలతో అందరిలో ఉత్కంఠ కలుగుతోంది. భవిష్యత్ లో ఇంకా ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.
జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించడంతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైంది. ఇదేదో తమను ఇరుకునపెట్టేలా ఉందని భావిస్తున్నాయి. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ అనుకున్నంత పని చేసి అందరిలో ఆశ్చర్యం నింపారు. భవిష్యత్ లో ఎన్నికలే శరణ్యం కావడంతో సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
Also Read:Balakrishna New Look: వైరల్ : ఓల్డ్ గెటప్ లో హీరో.. పవర్ ఫుల్ గెటప్ లో విలన్