Hyderabad Police Seizes Pub: హైదరాబాద్ లో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతోంది. డ్రగ్స్ తీసుకుంటూ లేట్ నైట్ పార్టీలతో చిందులేస్తున్నారు. ఏంటంటే వీఐపీ కల్చర్ అంటూ తేలికగా తీసుకుంటున్నారు. దీంతో పబ్ ల జోరు పెరుగుతోంది. యువత మత్తులో జోగుతోంది. ఉత్ప్రేరకాలు వాడుతూ తమ బతుకును ఛిద్రం చేసుకుంటున్నారు. పబ్ లో జరిగే తంతుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేశారు. దొరికిన వారిని అదుపులోకి తీసుకోగా అందరు సెలబ్రిటీలు అని తెలిసి ఆశ్చర్యపోయారు. వారిలో ఓ సినీనటుడు కూతురు ఉన్నట్లు తెలియడంతో చర్చనీయాంశం అవుతోంది.
డ్రగ్స్ పార్టీలో మాజీ ఎంపీ అంజనీ కుమార్ అల్లుడు అరవింద్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ కుమారుడు, మాజీ డీజీపీ కుమార్తె, మాజీ ఎంపీ అల్లుడు వారిలో ఉన్నట్లు తెలిసింది. రాడిసన్ హోటల్ ఫుడిం్ మింగ్ పబ్ ను అధికారులు సీజ్ చేశారు. పోలీసులను చూసిన వారు డ్రగ్స్ ను బయటకు విసిరేసినట్లు తెలుస్తోంది. పబ్ తేజస్వి, కిరణ్ రాజు, సతీష్ రాజు పేరుతో బుక్ అయినట్లు సమాచారం.
Also Read: Kalyan Ram Bimbisara: ‘బింబిసార’ రాక ఓకే.. ఇంతకీ కేక పెట్టిస్తాడా ?
తెల్లవారిజామున అందిన సమాచారం మేరకు పోలీసులు లేట్ నైట్ పార్టీపై దాడులు చేశారు. ఇందులో ప్రముఖ నటుడు, నిర్మాత కూతురు, బిగ్ బాస్ తెలుగు విజేత, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, బడాబాబుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని విచారణ అనంతరం విడిచిపెట్టినట్లు సమాచారం.
దీంతో డ్రగ్స్ దందా నివారణకు పోలీసు యంత్రాంగం ఎంత కృషి చేస్తున్నా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీనిపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్ యజమానులు దందా నిర్వహణలో ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు దాడులు చేసిన సందర్భంలో కొందరు యువకులు హంగామా సృష్టించినట్లు సమాచారం. తమపై ఎందుకు దాడి చేశారంటూ ఆందోళన చేయడంతో పోలీసులు విడిచిపెట్టినట్లు చెబుతున్నారు. మొత్తానికి డ్రగ్స్ దందా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అంతకంతకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read:Actor Hema: డ్రగ్స్ కేసులో తన పేరు ఆ మీడియా వెల్లడించడంపై నటి హేమ నిప్పులు