పాకిస్తాన్ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నభిన్నమవుతోంది. తాజాగా ఆ దేశం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వందశాతం లోటు ఏర్పడిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ప్రభుత్వం ఈ వాణిజ్య లోటును తగ్గించగలిగినా ఈ ప్రభుత్వంలో దిగుమతులు బాగా పెరిగిపోవడంతో ఆర్థిక లోటు తీవ్రమైంది. అయితే ఇంతగా ఆర్థిక లోటు ఉంటే దేశానికే ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా దిగుమతులు విపరీతంగా పెరిగితే డాలర్ మారకం పెరిగి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందంటున్నారు. ఇలా తీవ్రమైన ఆర్థిక లోటు ఏర్పడడంతో ‘రెడ్ జోన్’గా అభివర్ణిస్తున్నారు.

దేశంలో ఇంతలా ఆర్థిక లోటు ఏర్పడడానికి కారణం ఏంటి..? అంటే దిగుమతులకు అనుగుణంగా దేశంలో ఆదాయం పెరగకపోవడమే అంటున్నారు ఆ దేశానికి చెందిన ఆర్థిక వేత్తలు. ఆహార పదర్థాలు, చమురు, వాహనాల వినియోగం అధికంగా ఉందంటున్నారు. డిమాండ్ మేరకు వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు అందుకు అనుగుణంగా కూడా ఉత్పత్తి ఉండాలని, అలా లేకపోవడం వల్లే లోటు ఏర్పడిందని అంటున్నారు. అధిక వినియోగం మంచి పరిణామమే అయినా అందుకు తగ్గ ఉత్పత్తి కూడా ఉండాలంటున్నారు.
2018 నుంచి పాకిస్తానీయుల తలసరి ఆదాయం ప్రతీ సంవత్సరం తగ్గుతూ వస్తోంది. గతంలో దేశవ్యాప్తంగా తలసరి ఆదాయం 1,482 ఉండగా అది 1,190డ డాలర్లకు పడిపోయింది. ఇక ఆర్థిక లోటకు ఎగుమతులు తగ్గిపోవడం మరొక కారణంగా చెబుతున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 31 బిలియన్ల డాలర్లకు చేరింది.ఆ తరువాత సంవత్సరం నుంచి తలసరి ఆదాయం తగ్గుతూ వస్తోంది.డాలర్ తో పోలిస్తే ఎగుమతుల పరంగా పాకిస్తాన్ ఎలాంటి వృద్ధి సాధించనట్లే కనబడుతోంది.
పామాయిల్, గోధుమలు, చక్కెర వంటి పదార్థాలను సైతం దిగుమతి చేసుకుంటుందంటే ఆర్థికలోటు ఎంత దిగజారిందో అర్థమవుతోంది. అలాగే మెషినరీలు దిగుమతులు చేసుకుంటున్నా.. అందుకు అనుగుణంగా ఉత్పత్తి జరగడం లేదు. దీంతో లోటు తీవ్రంగా ఏర్పడిందని అంటున్నారు. ఇదే కాకుండా పాకిస్తాన్ నుంచి అప్ఘనిస్తాన్ అక్రమంగా ఆహార పదార్థాలను తరలిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ వాదనను పాకిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. కానీ ఖరీదైన ఆహార పదార్థాలను కొనే శక్తి ఆ దేశానికి తేనందున ఈ వాదనను కొందరు బలపరుస్తున్నారు.
పాకిస్తాన్ దేశం ఎక్కువగా వాహనాలు, మెషనరీ వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. గత ఆగస్టులో 66,000 మెట్రిక్ టన్నుల చక్కెరను దిగుమతి చేసుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువగ 2020 ఆగస్టులో 917 మెట్రిక్ టన్నుల చక్కెర దిగుమతి అయింది. అలాగే గోధుమ 70 శాతం, పామాయిల్ 120 శాతం మేర దిగుమతి అవుతోంది. ఇక పప్పుధాన్యాలు, తేయాకు ఉత్పత్తుల్లో ఎగుమతుల శాతం పెరిగింది. చమురు ఉత్పత్తులు 128 పెరగగా వాహనాల సంబంధించిన దిగుమతుల్లో 200 శాతానికి పైగా వృద్ధి సాధించింది. ఇక మెషినరీని కూడా బాగానే దిగుమతి చేసుకుంటున్నారు.
పాకిస్తాన్ ఆర్థిక విషయంలో రెడ్ జోన్ గా మారిందని కొందరు దేశానికి చెందిన ఆర్థిక వేత్తలు అంటున్నారు. దీంతో కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోతుందని అంటున్నారు. దీని వల్ల విదేశీ మారక విలువ పడిపోయి దేశం సంక్లిష్టమైన చట్రంలో చిక్కుకుందన్నారు. వాణిజ్య లోటును తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామిన పీటీఐ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఎలాంటి వ్యూహత్మకం లేదని అంటున్నారు. ఈ విషయంలో రోజురోజుకు నమోదవుతున్న ఫలితాలు చూస్తే రాను రాను మరింత ప్రమాద స్థాయిలో పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం 3 నెలల్లోనే 12 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదైతే ఏడాది చివరి వరకు ఎంత స్థాయిలో నమోదఅవుతుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.