Homeఅంతర్జాతీయంహతవిధీ.. పాకిస్తాన్ దుస్థితి ఎంతకు దిగజారిందంటే?

హతవిధీ.. పాకిస్తాన్ దుస్థితి ఎంతకు దిగజారిందంటే?

Pakistan PM Imran Khanపాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. దీంతో ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు ఎన్నో అవస్థలు పడుతోంది. దేశం యావత్తు ఆపదలో చిక్కుకుంది. ప్రభుత్వ నిర్వహణ కూడా కష్టసాధ్యంగా మారింది. దీంతో సాక్షాత్తు ప్రధానమంత్రి నివాసాన్నే అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని భావించడంపై అక్కడి మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి.

ప్రభుత్వమే ఈ వ్యవహారంపై రెండు కమిటీలు నియమించింది. ప్రధాని అధికారిక నివాస మర్యాదలు, క్రమశిక్షణ నియమావళి ఉల్లంఘించకుండా చూడాల్సిన బాధ్యత కమిటీలపై ఉంచింది. ప్రధాని నివాసంలో ఆడిటోరియం, రెండు గెస్ట్ వింగ్స్, ఒక లాన్ ను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ లో ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి కారణాలపై పలు విమర్శలు సైతం వస్తున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సరైన విధంగా పాలన చేయకపోవడంతోనే దేశం దిగజారిపోయిందని సమాచారం.

2018లో పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ తమ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉందని తెలుసుకుని సర్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదని తెలుస్తోంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవడం కోసం ప్రధాని అధికారిక నివాసాన్ని ఉపయోగించుకోక తప్పలేదు. ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్థిక వ్యవస్థ అగాధంలో పడిపోయింది.

దీంతో ప్రధాని అధికారిక నివాసాన్ని సైతం అద్దెకు ఇచ్చి యూనివర్సిటీగా మారుస్తామని చెబుతున్నారు. 2019లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆర్థిక వ్యవస్థ కుదుటపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. పీఎం నివాసాన్ని అద్దెకిచ్చి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ నిర్వహణకు ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ 19 బిలియన్ డాలర్లకు పతనమవడం తెలిసిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular