Pakistan and China : భారత్, పాకిస్తాన్ మధ్య గగనతలంలో కొత్త పోటీ మొదలవబోతుందా.. ఇండియా అమెరికా నుంచి చాలా అత్యాధునిక F-35 యుద్ధ విమానాలు కొనే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్ చైనా నుంచి J-35 అనే కొత్త యుద్ధ విమానాలను తీసుకోవాలని చూస్తోంది. ఈ రెండు విమానాలు కచ్చితత్వంతో భీకరంగా దాడి చేసే ఐదో తరం విమానాలు. ఒకవేళ ఈ విమానాలు ఈ దేశాలకు వస్తే, మన ప్రాంతంలో యుద్ధాలు జరిగితే గగనతలంలో పెద్ద మార్పులు వస్తాయని సైనిక నిపుణులు అంటున్నారు.
ఇండియా కొనాలనుకుంటున్న F-35 స్పెషాలిటీ
ఇండియా కొనాలని చూస్తున్న F-35 విమానం ఇప్పటికే చాలా యుద్ధాల్లో తన సత్తా చాటుకుంది. ఇది ఒకేసారి చాలా పనులు చేస్తుంది. దీనికి చాలా అత్యాధునిక రాడార్‌లు ఉంటాయి. చుట్టూ 360 డిగ్రీల వాతావరణాన్ని చూపిస్తుంది. శత్రువుల సిగ్నల్స్‌ను కూడా పసిగట్టగలదు. ఇది చాలా రహస్యంగా వెళ్తుంది కాబట్టి రాడార్‌లకు అస్సలు చిక్కదు. దూరం నుంచే శత్రువులను చూసి దాడి చేయగలదు. దీని లోపలే అధునాతన క్షిపణులు, బాంబులు ఉంటాయి. దీనికి చాలా పవర్ ఫుల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గంటకు దాదాపు 1,980 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.
పాకిస్తాన్ కొనాలని చూస్తున్న J-35 ప్రత్యేకతలు
చైనా కొత్తగా తయారు చేసిన J-35 విమానం రెండు ఇంజిన్లు ఉన్న స్టీల్త్ విమానం. ఇది కూడా శత్రువుల విమానాలను కూల్చడానికి, దాడులు చేయడానికి వాడతారు. ఇది F-35 అంత పాతది కానప్పటికీ దీనిలో కూడా సీక్రెట్ గా వెళ్లే టెక్నాలజీ ఉంది. గంటకు దాదాపు 2,220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో PL-15, PL-10 ఉంటాయి. ఇది లోపల, బయట కలిపి 8,000 కిలోల ఆయుధాలను మోయగలదు. ఇది చైనా J-20 కన్నా చిన్నది కాబట్టి వేగంగా, తక్కువ ఖర్చుతో ఉంటుంది. ఇది పాకిస్తాన్ బడ్జెట్‌కు సరిపోతుంది.
Also Read : పాకిస్తాన్ చెప్పడం.. చైనా వంతపాడటం.. వీటి బుద్ధి మారదు
ఇండియాకు ఎందుకు అవసరం?
ఇండియాకు F-35 విమానాలు కావడానికి ముఖ్య కారణం చైనా దగ్గర చాలా J-20 స్టీల్త్ విమానాలు ఉండటం (200కి పైగా ఉన్నాయట). అటు పాకిస్తాన్ J-35 విమానాలు కొనే అవకాశం ఉండడం వల్లే ఇండియా కూడా కొనాలని భావిస్తుంది. మన వైమానిక దళానికి తగినన్ని విమానాలు లేవు. ఇండియా సొంతంగా తయారు చేసుకుంటున్న AMCA విమానం రావడానికి ఇంకా 2030ల మధ్య వరకు పడుతుంది. అందుకే F-35 విమానాలు వెంటనే మనకు పెద్ద ప్రయోజనాన్ని ఇస్తాయి. అయితే, రష్యా నుంచి S-400 రక్షణ వ్యవస్థ కొనడం వల్ల అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీనికి దౌత్యపరమైన పరిష్కారం దొరకాలి.
పాకిస్తాన్‌కు ఎందుకు కావాలి?
పాకిస్తాన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, చైనాతో స్నేహం వల్ల J-35 విమానాలను కొనే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ ప్రస్తుత F-16, JF-17 విమానాల కంటే చాలా పెద్ద అప్‌గ్రేడ్ అవుతుంది. పాకిస్తాన్ 40 J-35 జెట్‌ల కోసం ఒప్పందం చేసుకున్నట్లు వార్తలున్నాయి. చైనా అప్పు ఇచ్చి వీటిని కొనేలా సహాయపడవచ్చు. రెండేళ్లలో డెలివరీలు మొదలవచ్చట. ఈ విమానాలు వస్తే పాకిస్తాన్‌కు స్టీల్త్ టెక్నాలజీలో మొదట ప్రయోజనం దొరుకుతుంది. ఇది ఇండియాపై ఒత్తిడి పెంచుతుంది.
2028లో యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది ?
* F-35 విమానాలు సీక్రెట్ గా వెళ్తాయి కాబట్టి, శత్రువులను ముందుగా గుర్తించగలవు. మన AWACS విమానాలు F-35లకు సమాచారం ఇస్తాయి. J-35 విమానాలు కూడా తమ రాడార్ల ద్వారా F-35లను గుర్తించడానికి ప్రయత్నిస్తాయి. కానీ F-35 సిగ్నల్స్‌ను జామ్ చేయగలదు కాబట్టి, ఇండియాకు మొదట ప్రయోజనం ఉంటుంది.
* ఈ రెండు విమానాలు దూరం నుంచే దాడి చేయడానికి తయారైనవి. F-35లో AIM-120D క్షిపణులు ఉంటాయి (దాదాపు 180 కి.మీ దూరం). దీని సెన్సార్లు చాలా బాగా పని చేస్తాయి. మన పైలట్లు శత్రువుల పరిధిలోకి వెళ్లకుండానే క్షిపణులను ప్రయోగించగలరు. పాకిస్తాన్ కూడా PL-15 క్షిపణులతో దాడి చేస్తుంది. కానీ అవి ఎంత బాగా పని చేస్తాయో చూడాలి. F-35 రహస్యంగా ఉండడం వల్ల చాలా దాడుల నుంచి తప్పించుకోగలదు.
* ఒకవేళ విమానాలు దగ్గరికి వచ్చి కొట్టుకుంటే J-35 వేగంగా, చురుకుగా కదలగలదు కాబట్టి F-35కి సవాల్ కావచ్చు. F-35 వేగంగా కదలడం కన్నా రహస్యంగా ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ పైలట్ల శిక్షణ చాలా ముఖ్యం. మన భారత వైమానిక దళ పైలట్లకు మంచి శిక్షణ ఉంటుంది కాబట్టి వారికి కొంత ప్రయోజనం ఉండొచ్చు.
ఈ అంచనా ప్రకారం F-35 టెక్నాలజీ వల్ల ఇండియాకు చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే, J-35 తక్కువ ఖర్చుతో, చైనా సాయంతో వస్తుంది కాబట్టి అది కూడా పెద్ద ముప్పే. కాశ్మీర్ పర్వత ప్రాంతాలు స్టీల్త్ విమానాలకు కొంచెం కష్టం, కానీ మన దగ్గర పెద్ద ఎయిర్ ఫోర్స్, మంచి మౌలిక సదుపాయాలు ఉండడం వల్ల మనకు కలిసొస్తుంది. పాకిస్తాన్ చాలా విమానాలతో ఒకేసారి దాడి చేయాలని, లేదా చైనీస్ డ్రోన్‌లతో కలిపి దాడి చేయాలని చూడవచ్చు.
