Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానటువంటి గొప్ప విజయాలను సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్(Prabhas)…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయన ఎప్పుడైతే బాహుబలి (Bahubali) సినిమా చేశాడో అప్పటి నుంచే బాలీవుడ్ హీరోల పతనం స్టార్ట్ అయింది. మన హీరోల వైభవం మొదలైంది. అందువల్లే ఆయన బాహుబలి సినిమా నుంచి కల్కి సినిమా వరకు వరసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ ప్రేక్షకులందరూ అతని సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే ఆయనకి ఎంత గొప్ప క్రేజ్ సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.పాన్ ఇండియాలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానటువంటి రీతిలో భారీ విజయాలను సాధిస్తూ ప్రతి సినిమాతో మినిమం గ్యారంటీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక హీరో కూడా తనే కావడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే స్పిరిట్ (Spirit) సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ మధ్య వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఫౌజీ సినిమా అయిపోయిన తర్వాత సలార్2(Salaar 2), కల్కి 2 (Kalki 2) సినిమాల మీద తన పూర్తి ఫోకస్ ను కేటాయించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) మాత్రం ప్రభాస్ మీద నమ్మకం ఉంచి ఆయన కోసమే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమా ఉంటుందా?లేదా మరికొద్ది రోజులు లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే విషయం మీదనే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఒకరకంగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కోసం వేచి చూడకుండా ‘అనిమల్’ (Animal) తర్వాత వేరే హీరోతో ఒక సినిమా చేయవచ్చు.
Also Read :ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
కానీ ఆయన ప్రభాస్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి తన సినిమా డేట్స్ మొత్తాన్ని సలార్ మీదనే కేటాయించాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇటు సలార్ టీం నుంచి కల్కి టీం నుంచి ప్రభాస్ కి ప్రెషర్ వస్తుండడంతో స్పిరిట్ (Spirit) సినిమాని కొద్ది రోజులు పక్కన పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
సాలార్ 2, కల్కి2 మూవీ కోసం ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రభాస్ కి కొన్ని ప్రెజర్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి సందీప్ ను ఆ లోపు మరో సినిమా చేసుకోమని చెబుతాడా? లేదంటే సలార్2(Salaar 2), కల్కి2 (Kalki 2) ల కంటే ముందే స్పిరిట్ సినిమాకి డేట్స్ ఇచ్చి ఈ మూవీని కంప్లీట్ చేస్తాడా? అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…