Pahalgam Attack: పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడిని దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఆ దృశ్యాలు గుర్తుకొచ్చినప్పుడల్లా దిగ్బ్రాంతికి గురవుతున్నారు. నిజానికి పహల్గాం అనేది సుందరమైన ప్రదేశం. దీనిని మన దేశపు స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఆకాశాన్ని తాకే విధంగా ఉండే కొండలు.. దానికి తగ్గట్టుగా పచ్చటి చెట్లు.. గలాగలాపారే సెలయేర్లు.. పహల్గాం ప్రాంతాన్ని భూలోక స్వర్గంగా మార్చాయి.. అందుకే ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఏడాది మొత్తం పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తుంటారంటే.. ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.పర్యాటకులకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. రిసార్టులు.. హోటళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి. పైగా వాతావరణం లో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎంతసేపు అక్కడ పర్యటించినా అలసట అనేది ఉండదు. పైగా ఇది అమర్నాథ్ యాత్రస్థలికి ప్రారంభ ప్రాంతంగా ఉండడంతో.. పహల్గాం ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు.. ఈ ప్రాంతం వైవిధ్యాన్ని కాపాడడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ జాగ్రత్తలే ఉగ్రవాదులకు వరంగా.. పర్యాటకులకు శాపంగా మారాయని తెలుస్తోంది.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడి: కాశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులు
ఎందుకు ఎంచుకున్నారు అంటే..
పహల్గాం లోని బైసరం లోయలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. అయితే ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులు తమకు అనువైన ప్రాంతంగా ఎంచుకోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఈ ప్రాంతంలో పచ్చదనం బాగుంటుంది. అయితే కాలుష్యం వల్ల ఆ పచ్చదనం పాడవకుండా ఉండడానికి పహల్గాం ప్రాంతం నుంచి బైసరన్ వరకు.. అంటే దాదాపు 5 కిలోమీటర్లు మోటార్ వాహనాలను ఏమాత్రం అనుమతించారు. ఆ లోయలోకి వెళ్లాలంటే నడిచి లేదా గుర్రాల మీదుగా ప్రయాణం సాగించాలి. పైగా బైసరన్ లోయ అనేది మైదాన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏదైనా దాడులు జరుగుతే కాపాడుకోవడానికి అవకాశం ఉండదు. అందువల్లే ఈ లోయను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు.. ఈ లోయ చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన వృక్షాలు ఉన్నాయి. వాటికి సమీపంలోనే అడవులు కూడా ఉన్నాయి. ఈ దాడికి పాల్పడి.. ఉగ్రవాదులు సులభంగా ఆ లోయలోకి వెళ్లిపోయారు. పర్యాటకులకు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో.. ఉగ్రవాదులు ఉన్మాదుల లాగా కాల్పులు జరిపారు. తద్వారా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దాడులకు పాల్పడినప్పటికీ.. ఇక్కడ ప్రతి చర్యలు తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. వీటన్నిటిని అంచనా వేసిన ఉగ్రవాదులు పర్యటకులు భారీగా రాగానే బైసరన్ లోయలో కాల్పులకు తెగబడ్డారు. 28 మంది పర్యాటకుల ప్రాణాలు బలిగొన్నారు. ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసి.. అత్యంత క్రూరంగా చంపేశారు. సైనికుల మాదిరిగా వచ్చిన ఉగ్రవాదులు.. చేతిలో తుపాకులు పట్టుకొని ఇష్టానుసారంగా కాల్పులు జరిపారు. కేవలం పురుష పర్యటకులను లక్ష్యంగా చేసుకొని అత్యంత క్రూరమైన దాడులకు పాల్పడ్డారు.