Pahalgam Attack: ఉగ్రవాదులు తలదాచుకున్నారని భావిస్తున్న అడవులను భారత భద్రతా దళాలు చుట్టుముట్టాయి. వారిని ఏరి పారేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.. ఇక ఇదే క్రమంలో ఈ ఘటనకు పాకిస్తాన్ కారణమని భారత్ మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ లష్కరే ఏ తోయిబా నుంచి పుట్టుకొచ్చిందే. లష్కరే ఏ తోయిబా సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఎప్పటినుంచో వాదనలు ఉన్నాయి.. దాన్ని బలపరుస్తూ అనేక సంఘటనలు జరిగాయి. వీటన్నింటిని మననంలో పెట్టుకున్న భారత్.. పాకిస్తాన్ పై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపి వేయనుంది.
Also Read: శ్రీనగర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులు.. బంధువుల్లో ఆందోళన
భారత్ – పాకిస్తాన్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం సింధు, జీలం, చినాబ్ నదుల నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ వ్యవసాయానికి, గృహ అవసరాలకు ఈ నదులు నీరే ఆధారం. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలు ఎడారిగా మారుతాయి. అయితే సింధు నదికి ఉపనదులైన చీనాబ్, జీలం నదులు భారత్ లోనే పుట్టి.. పాకిస్థాన్లో ప్రవహిస్తాయి. సింధు నది చైనాలో పుట్టి భారత్లో ప్రవహిస్తుంది. కేవలం నీటి ఒప్పందం రద్దు మాత్రమే కాదు.. పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలను భారత్ పూర్తిగా తేల్చుకుంది..SAARC వీసా ఉన్న పాకిస్తాన్ పౌరులు తమ స్వదేశానికి వెళ్ళిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారిచేసింది. పాకిస్తాన్ పర్యాటకులు కూడా 48 గంటల్లో తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అటారి – వాఘా సరిహద్దులు వెంటనే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పౌరులను భారతదేశంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏ క్షణమైనా..
. ఇప్పటికే పహల్గామ్ ప్రాంతంలోని అడవులను చుట్టుముట్టింది. విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను మట్టు పెట్టింది. ఇక ఇదే సమయంలో రక్షణ శాఖ మంత్రి త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు మీడియాకు పొక్క కుండా జాగ్రత్త పడుతోంది. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ కు షాక్ ల మీద షాక్ లు ఇచ్చే పనిలో కేంద్రం పడింది. ఇప్పుడు కూడా అలాంటి పనినే భారత్ చేస్తుందని జాతీయ మీడియాలో వార్త కథనాలు ప్రసారమవుతున్నాయి. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పై దెబ్బకొట్టాలని భారత్ భావిస్తోంది. అందువల్లే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిగా రద్దు చేసుకుంటున్నది.
Also Read: పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్థాన్ అప్రమత్తం..