Lemon Juice : ప్రకృతిలో లభించే కొన్ని కూరగాయలు, పండ్లు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ వీటిని సరైన విధంగా ఉపయోగించక చాలామంది అవస్థలు పడుతూ ఉంటారు. అంతేకాక వీటిలో అనేక రకాల ప్రోటీన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరానికి ఎంతో మేలుని చేస్తాయి. రెగ్యులర్గా కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల మెడిసిన్ వాడే అవసరం తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే కొన్ని రకాల కూరగాయలు పండ్లు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తే.. మరికొందరికి ఇవి విషయంగా మారుతాయి. అంతేకాకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీటిలో నిమ్మరసం ఒకటి. నిమ్మరసం మల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటిని కొందరు అసలు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వారు ఎవరంటే?
Also Read : తేనె, నిమ్మరసం కలిపి తీసకుంటే ఎన్ని లాభాలో?
నిమ్మ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. దీంతో నిమ్మకాయను ఆహార పదార్థాల్లో గాని ప్రత్యేకంగా నిమ్మరసం చేసుకుని తాగడం వల్ల శరీరానికి సి విటమిన్ అధికంగా లభించి అనేక రకాల ప్రయోజనాలు అందుతాయి. సి విటమిన్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ మెరుగ్గా ఉండడానికి సి విటమిన్ తప్పనిసరి అని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. అయితే నిమ్మకాయను ఆహార పదార్థాల్లోనే కాకుండా ప్రత్యేకంగా దీని జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతను తీసేస్తుంది. నిమ్మరసం తాగి బయటకు వెళ్లడం వల్ల ఎంత ఎండ వేడినైనా తట్టుకునే శక్తి వస్తుంది. అయితే నిమ్మరసాన్ని మాత్రం కొందరు తాగకూడదు అని అంటున్నారు.
నిమ్మరసంలో అల్సర్ తో బాధపడేవారు తాగకూడదు అని అంటున్నారు. ఎందుకంటే ఇందులో సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్లి ఆమ్లం గా తయారవుతుంది. ఇప్పటికే అల్సర్ తో బాధపడేవారు ఎక్కువగా దీనిని తీసుకోవడం వల్ల మరింతగా గ్యాస్ ట్రిక్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఇది ఇలాగే కొనసాగి జీర్ణక్రియ వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అల్సర్ ఎక్కువై గుండెపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది.
కీళ్ల నొప్పులతో పాటు బోన్స్ కు సంబంధించిన సమస్యలు ఉన్నవారు సైతం నిమ్మరసాన్ని ఎక్కువగా తాగకూడదని అంటున్నారు. వీరికి ఇప్పటికే బాధలు ఉండడం వల్ల నిమ్మరసంతో మరింతగా నష్టం చేకూరి అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల వీరు నిమ్మరసానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.
అయితే వేసవిలో శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని కొందరు చెబుతున్నారు. అల్సర్ ఉన్నవారు దాదాపుగా దూరంగా ఉండడమే మంచిదని.. ఆర్తో సమస్యలు ఉన్నవారు మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు. నిమ్మరసం మాత్రమే కాకుండా సిట్రిక్ ఆమ్లం ఉండే జ్యూసులు తాగకపోవడమే మంచిదని అంటున్నారు. వీటివల్ల మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తుందని అంటున్నారు. అయితే మిగతావారు మాత్రం నిమ్మ రసం తాగడం వల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలు పొందుతారు.
Also Read : గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?