Pahalgam Attack: పహల్గాం అనేది కాశ్మీర్ లోని ఒక అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు మించవు. ఇక శీతకాలంలో అయితే మైనస్ డిగ్రీలలోకి పడిపోతాయి. దట్టమైన అడవులు.. ఆకాశాన్ని తాకే కొండలు.. సుదూరంగా కనిపించే హిమాలయ పర్వతాలు ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్ గా మార్చాయి. ఈ ప్రాంతంలో అధికారికంగా కాశ్మీరీ, ఉర్దూ, హిందీ, డోగ్రి, ఇంగ్లీష్ భాషలను ప్రజలు మాట్లాడుతుంటారు. అనంత్ నాగ్ జిల్లా నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పట్టణం అమర్నాథ్ తీర్థయాత్ర కు ప్రారంభ స్థానం గా ఉంటుంది. ఇక పహల్గామ్ అంటే కాశ్మీరీ భాషలో “గొర్రెల కాపరుల గ్రామం”. గోమ్ అంటే గ్రామమని.. పహల్ అంటే గొర్రెలు అని అర్థం. దీనిని ఎద్దు గ్రామం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే శివుడు అమర్నాథ్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో తన ఎద్దును పహల్గాం ప్రాంతంలోనే వదిలిపెట్టాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అమర్నాథ్ యాత్ర ప్రారంభంలో ఈ ప్రాంతంలో శివ భక్తులు కిటకిలాడుతుంటారు. అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ ప్రాంతాన్ని విస్తారంగా సందర్శిస్తుంటారు. ముఖ్యంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతంలో విపరీతంగా మంచు కురుస్తుంది. ఆ వాతావరణం ఆస్వాదించడానికి పర్యాటకులు విపరీతంగా ఇష్టపడుతుంటారు. అందువల్లే ఈ ప్రాంతానికి ఇండియన్ స్విట్జర్లాండ్ అని పేరు వచ్చింది.
Also Read: కాశ్మీర్‌లో విదేశీ ఉగ్రవాదులు.. పహల్గామ్ దాడి వెనుక పాక్ కుట్ర!
కాశ్మీర్ లోయలో..
పహల్గాం కాశ్మీర్ లోయలో జీలమ్ నదికి తూర్పున ఉంటుంది.. ఇక్కడ లిడ్డర్ నది రెండు గా చీలిపోయి ప్రవహిస్తుంది.. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ప్రవహించి.. ఇరుకైన లోయ మీదుగా మళ్లీ పహల్గాం ప్రాంతంలో కలుస్తుంది. లిడ్డర్ నది ఒకటి ఈశాన్యంలో అమర్నాథ్ వైపు ప్రవహిస్తే.. మరొకటి వాయువ్య భాగంలో ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం మొత్తం సున్నపురాయి శిలాలతో కూడి ఉంటుంది. ఇక్కడ ఫిర్, ఫైన్ రకానికి చెందిన వృక్షాలు కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పగటిపుట ఉష్ణోగ్రతలలో తీవ్రమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఇంటికి రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి. చలికాలంలో 13 అడుగుల కంటే ఎక్కువ మందంతో మంచి కురుస్తుంది. ఇక్కడ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటాయి. నవంబర్ అనంతరం ఫిబ్రవరి వరకు ఉష్ణోగ్రతలు.. పడిపోతుంటాయి. ఈ ప్రాంతం పచ్చగా ఉంటుంది.. చలిగాలులు కూడా ఎక్కువగా వీస్తుంటాయి. కొండలు.. పచ్చటి వృక్షాలు.. లోయలు ఈ ప్రాంతాన్ని ఇండియన్ స్విట్జర్లాండ్ గా మార్చాయి. అందువల్లే ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దురదృష్టవశాత్తు మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది చనిపోవడం తో పహల్గాం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.