Rashmika Mandanna: బుల్లితెర ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు దీపిక(Deepika Rangaraju). స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతూ సుమారుగా 700 ఎపిసోడ్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ లో ఈమె హీరోయిన్. కేవలం సీరియల్ లోనే కాదు, అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొంటూ తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ఉంటుంది. ఈమె చలాకీతనం ని చూసి ఎంతటి వారైనా బయపడాల్సిందే. శ్రీముఖి, సుమ వంటి వారు కూడా ఈమె ఒక షోకి వస్తుందంటే భయపడి పోతుంటారు. అలాంటి హుషారైన అమ్మాయి ఈమె. ఈసారి ఈమె బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈమె ఆహా మీడియా లో ‘డ్యాన్స్ ఐకాన్ 2’, ‘చెఫ్ మంత్ర 2’ వంటి ప్రోగ్రామ్స్ లో కనిపిస్తుంది.
Also Read: ఐశ్వర్య రాయ్ తో నటించినందుకు రజినీకాంత్ ఇన్ని అవమానాలు ఎదురుకున్నాడా?
అయితే బిగ్ బాస్ ఫేమ్ తేజస్విని ముడివాడా ఆహా యాప్ లో ‘కాకమ్మ కబుర్లు’ అనే టాక్ షో ని నిర్వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ టాక్ షో కి రెండవ సీజన్ అతి త్వరలోనే ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కి దీపికా విచ్చేసింది. సాధారణంగా ఈ షోకి వచ్చే గెస్ట్స్ తేజు ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందో అని భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆమె ప్రశ్నలన్నీ చాలా బోల్డ్ గా ఉంటాయి. కానీ ఈసారి తేజు దీపికా దెబ్బకు బయపడింది. ఈమె నుండి ఎలాంటి సమాదానాలు వినాల్సి వస్తుందో అని. ఆమె భయానికి తగ్గట్టే దీపికా కూడా సమాదానాలు చెప్పింది. అందుకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ముఖ్యంగా రష్మిక(Rashmika Mandanna) గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. తేజస్విని ఒక ప్రశ్న అడుగుతూ ‘సినిమాల్లో నటించే హీరోయిన్స్ లో ఎవరిని చూస్తే మీకు నా అంత కాకపోయినా నాలా నటిస్తే బాగుంటుంది అని నీకు అనిపించింది?’ అని అడగ్గా, దానికి ఆమె రష్మిక పేరు చెప్పింది. అదే విధంగా హీరోలలో నీ క్రష్ ఎవరు అని అడగ్గా, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పేరు చెప్తుంది దీపికా. దేవరకొండ అంటే అంత ఇష్టం కాబట్టే రష్మిక మీద ఇందాక రివెంజ్ తీసుకున్నాను అని చాలా తెలివిగా సమాధానం చెప్పింది దీపికా. అదే విధంగా టాలీవుడ్ లో ఏ హీరో తో కలిసి నటించాలని అనుకుంటున్నారు అని అడగ్గా, నాగార్జున పేరు చెప్తుంది. ఈ ప్రోగ్రాం కి ప్రముఖ చెఫ్ సంజయ్ కూడా హాజరయ్యాడు. ఆయన కూడా అనేక ప్రశ్నలకు దీపికకు ఏ మాత్రం తీసిపోకుండా చాలా బోల్డ్ గా సమాధానం ఇచ్చాడు.