Pahalgam Attack: పహల్గాం లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పర్యాటకులను పిట్టలను కాల్చినట్టు ఉగ్రవాదులు కాల్చారు.. ఈ ఘటన తర్వాత కొంతమంది ఉదారవాదులు.. సో కాల్డ్ సెక్యులరిస్టులు (ఈ పదం వాడక తప్పడం లేదు) అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. నిఘా వ్యవస్థ విఫలమైందని. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమైందని.. జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని.. అందువల్లే ఈ ప్రతిఫలం అని.. ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు.. వాస్తవానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సందర్భంలో.. ఆర్మీలో భరోసా నింపాల్సిన సమయంలో.. ఇలాంటి దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయడం మనదేశంలో మాత్రమే సాధ్యమవుతుందేమో?!
Also Read: కశ్మీర్ కొండల్లో నక్కిన ఉగ్రవాదులు.. గుర్తించిన అత్యాధునిక నిఘా కెమెరాలు
ఓమర్ అబ్దుల్లా మంచి నిర్ణయం
పహల్గాం దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రాన్ని గాని.. ఆర్మీని గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. అంతేకాదు కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్నామని.. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను తాము సమర్థిస్తామని ఏకపక్షంగా తీర్మానం చేశారు.. దానికి అన్ని పార్టీల సభ్యులు సమ్మతం తెలిపారు. కాశ్మీర్ లోని షేర్ – ఏ – కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది..” అనాగరిక దాడి పట్ల మేము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఆవేదన చెందుతున్నాం.. శాంతియుతంగా ఉన్న పౌరులపై ఇలాంటి పిరికితనమైన దాడులు సరికావు. ఇటువంటి క్రూరమైన చర్యలకు సమాజంలో స్థానం లేదు. ఈ ప్రాంతంలో ఐక్యత వర్ధిల్లాలి. శాంతి విలసిల్లాలి. సామరస్యం చిహ్నం గా ఉండాలి. పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి కాశ్మీర్ లో మాత్రమే కాదు.. భారత్ పై ప్రత్యక్ష దాడి” అని అఖిలపక్ష సమావేశంలో పేర్కొన్నారు.. ఈ సమావేశంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతోపాటు కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, బిజెపి సభ్యులు, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ షాజాద్ లోన్, అవా మీ ఇత్తే హాద్ పార్టీ నాయకుడు షేక్ ఖుర్షీద్, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ నాయకుడు, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాబీ ఆజాద్, సిపిఐ (ఎం) నాయకుడు ఎంవై తరిగామి హాజరయ్యారు. సాధారణంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు.. తమ రాజకీయాల కోసం తాపత్రయ పడుతుంటాయి. ప్రజలలో లేనిపోని భయాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఓమర్ అబ్దుల్లా ఈ విషయంలో మాత్రం తన హుందాతనాన్ని ప్రదర్శించారు. కష్ట సమయంలో తన రాజకీయాలను పక్కనపెట్టి.. నెత్తి మాసిన రాజకీయాలను దూరం పెట్టి.. రాష్ట్ర ప్రయోజనాలే తనకు పరమావధి అని నిరూపించుకున్నారు. ఒకరకంగా కేంద్రాన్ని ఆయన పెద్దన్న లాగా అభివర్ణించారు. ఈ ఆపత్కాలంలో రాజకీయాల కంటే కాశ్మీర్ ప్రజలే ముఖ్యమని ఆయన పునరుద్గాటించారు. కాకపోతే ఒకవేళ జమ్ము కాశ్మీర్ స్థానంలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒకప్పటి కెసిఆర్ పరిపాలనలోని తెలంగాణ ఉండి ఉంటే వారి వ్యాఖ్యలు వేరే విధంగా ఉండేవి.. ఆల్రెడీ కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఏం చేశారో చూశాం. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం కదా..
Also Read: భారత్–పాక్ ఉద్రిక్తతలు.. ఎయిరిండియా, ఇండిగో విమానాలకు ప్రత్యామ్నాయ మార్గాలు..!