India Vs Pakistan: గతంలోనే చినాబ్ నది ప్రవాహాన్ని పాకిస్తాన్ వెళ్లకుండా మోడీ ప్రభుత్వం మళ్లించేసింది.. దీనికోసం ఏకంగా భారీ ప్రణాళిక రూపొందించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతంలో గత ఏడాది జనవరి లో కిష్త్వార్ జిల్లాలోని ద్రాబ్ షాల్లా వద్ద సొరంగాలు ఏర్పాటు చేసి చీనాబ్ నది ప్రవాహాన్ని మళ్లించింది. అక్కడికి నీటి ప్రవాహాన్ని నిలువరించి.. 4000 మందికి రాడ్లు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రత్యక్షంగా, రక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 5,289 కోట్ల విలువైన ఉచిత కరెంటు లభించడమే కాదు, 9,581 కోట్ల విలువైన నీటి వినియోగ చార్జీల నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.. 1960లో నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధినేత ఆయుబ్ ఖాన్ తో సింధు నది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నాడు ఈ ఒప్పందానికి వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిగా ఉంది. సట్లేజ్, బీస్, రావి నదుల నీటిని పాకిస్తాన్ సమ్మతం తెలిపిన వినియోగం పోగా మిగతా అన్నిటినీ ఇండియా ఉపయోగించుకోవచ్చు. సింధు నది విషయంలో పాకిస్తాన్ కు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అయితే ఈ ఒప్పందాల గడువు ముగియడంతో.. ముందస్తు చర్యగా ఇండియా తన భూభాగంలో ఉన్న నీటిని పూర్తిస్థాయిలో వాడుకోవడానికి ప్రాజెక్టులు నిర్మించింది. దీని ద్వారా మనదేశంలో సాగునీటి లభ్యత పెరుగుతుంది. తద్వారా పంటలు ఎక్కువగా పనడానికి అవకాశం ఏర్పడుతుంది.
Also Read: కశ్మీర్ కొండల్లో నక్కిన ఉగ్రవాదులు.. గుర్తించిన అత్యాధునిక నిఘా కెమెరాలు..
పాకిస్తాన్ కు అంత సీన్ లేదు
ఇక ఇప్పటికే పాకిస్తాన్ దివాలాలో ఉంది.. ప్రభుత్వం నిర్వహణకు రూపాయి రూపాయి అడుక్కునే పరిస్థితి.. చైనా అతి తెలివి వల్ల చైనా -పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బెలూచ్ ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఐఎంఎఫ్ పాకిస్తాన్ నమ్మడం లేదు. మొత్తంగా చూస్తే వెళ్లే నీటిని ఇండియా అడ్డుకోవడం లేదు. ఒకవేళ వచ్చే నీరు ఆగిపోతే పాకిస్తాన్ గట్టిగా అరిచే పరిస్థితి లేదు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు పూర్తయిపోయాయి.. అయితే ఇప్పుడు పహిల్గాం ఘటన జరిగిన తర్వాత మోడీ ప్రభుత్వం మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఒక రకంగా పాకిస్తాన్ కు చుక్కనీరు వెళ్లకుండా చేస్తోంది. పాకిస్తాన్ దేశంలో సాగే వ్యవసాయానికి.. సాగే జీవనానికి సింధు నది ప్రవాహమే ఆయువు పట్టు. పాక్ లో సాగయ్యే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, గోధుమలు, ఇతర పంటలకు సింధూ నది నీరే ప్రధాన ఆధారం. ఆ నీరు లేకపోతే పాకిస్తాన్ అడుక్కోవాల్సిందే. ఇప్పుడు చినాబ్ నది ప్రవాహం విషయంలోనూ భారత్ మరింత పట్టుదలతో ఉంది. చూడబోతే పాకిస్తాన్ ఎడారి అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.
Also Read: భారత్–పాక్ ఉద్రిక్తతలు.. ఎయిరిండియా, ఇండిగో విమానాలకు ప్రత్యామ్నాయ మార్గాలు..!