https://oktelugu.com/

కుంభమేళాతో కరోనా కల్లోలం.. అయినా పర్మిషన్

దేశంలో ప్రస్తుతం కరోనా హడలెత్తిస్తోంది. రోజుకు 2 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కేంద్రం రాష్ట్రాలను హెచ్చరిస్తూనే ఉంది. ప్రజలకు సైతం వైద్యశాతం ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూనే ఉంది. గుంపులు గుంపులుగా ఎక్కడా ఉండొద్దని.. ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాలని.. మూతికి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెబుతూనే ఉంది. అంతేకాదు.. పెళ్లిళ్లు, పేరంటాలకు సైతం పలు నిబంధనలు విధించింది. ఓ వైపు కరోనా కట్టడికి ఇన్ని చర్యలు తీసుకుంటుండగా.. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌‌లో కొనసాగుతున్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 15, 2021 / 03:17 PM IST
    Follow us on


    దేశంలో ప్రస్తుతం కరోనా హడలెత్తిస్తోంది. రోజుకు 2 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కేంద్రం రాష్ట్రాలను హెచ్చరిస్తూనే ఉంది. ప్రజలకు సైతం వైద్యశాతం ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూనే ఉంది. గుంపులు గుంపులుగా ఎక్కడా ఉండొద్దని.. ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాలని.. మూతికి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెబుతూనే ఉంది. అంతేకాదు.. పెళ్లిళ్లు, పేరంటాలకు సైతం పలు నిబంధనలు విధించింది. ఓ వైపు కరోనా కట్టడికి ఇన్ని చర్యలు తీసుకుంటుండగా.. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌‌లో కొనసాగుతున్న మహాకుంభమేళకు పర్మిషన్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

    ఈ కుంభమేల ఈనెల 30వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే కోవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కుంభమేళాను నిలిపివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు.. దీనిపై స్పందించిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకారమే కుంభమేళా జరుగుతుందని.. రెండు వారాల ముందుగానే కార్యక్రమాన్ని ముగింపును కూడా కొట్టిపడేసింది.

    అయితే.. కరోనా ఉధృతి నేపథ్యంలో పలువురు మత పెద్దలతో ప్రభుత్వం కూడా చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని కుదించాలని మత పెద్దలతో మాట్లాడగా.. వారు నిరాకరించినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ.. అలాంటి చర్చలేం జరగలేదని.. కుంభమేళా యథావిధిగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. వాస్తవానికి జనవరిలో జరగాల్సిన కుంభమేళా.. కోవిడ్‌ కారణంగానే ఏప్రిల్‌లో కొనసాగిస్తున్నట్లు కుంభమేళా అధికారి దీవత్‌ రావత్‌ చెప్పుకొచ్చారు.

    గంగానది ఒడ్డున జరుగుతున్న కుంభమేళా కార్యక్రమానికి లక్షలాదిగా జనం తరలివస్తున్నారు. వచ్చిన వారంతా పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మరింత స్ప్రెడ్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అంతేకాదు.. కుంభమేళాలో మరో ముఖ్యమైన తేదీ ఏప్రిల్‌ 27. ఆరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ‘షాహీ స్నానాలు’ ఆచరించనున్నారు. ఇక ఆ టైమ్‌లో భక్తులను ఆపడం ఎవరితరమూ కాదు. ఈ రోజు భారీ ఎత్తున వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బుధవారం ఒక్కరోజే ఉత్తరాఖండ్‌లో 2,167 కేసులు నమోదు అయ్యాయి.