https://oktelugu.com/

‘మే’ వరకు ఇదే పరిస్థితి.. ఖాళీ కానున్న బాక్సాఫీస్ !

కరోనా సెకెండ్ వేవ్ అంటూ మళ్ళీ ఈ సంవత్సరం కూడా, కోవిడ్ సినీ లోకాన్ని ఇబ్బందుల పాలు చేసేలా ఉంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల కలెక్షన్స్ కు మళ్ళీ బ్రేక్ పడేలా ఉంది. గత ఏడాది మొత్తం ఖాళీ అయినట్టే ఈ ఏడాది కూడా అలాగే అవుతుందేమో అని సినిమా మేకర్స్ భయంతో వణికిపోతున్నారు. నిజానికి ఈ సెకెండ్ వేవ్ లేకపోతే.. ఈ నెల మరికొన్ని క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అలరించేవి. ‘వకీల్ […]

Written By:
  • admin
  • , Updated On : April 15, 2021 2:58 pm
    Follow us on


    కరోనా సెకెండ్ వేవ్ అంటూ మళ్ళీ ఈ సంవత్సరం కూడా, కోవిడ్ సినీ లోకాన్ని ఇబ్బందుల పాలు చేసేలా ఉంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల కలెక్షన్స్ కు మళ్ళీ బ్రేక్ పడేలా ఉంది. గత ఏడాది మొత్తం ఖాళీ అయినట్టే ఈ ఏడాది కూడా అలాగే అవుతుందేమో అని సినిమా మేకర్స్ భయంతో వణికిపోతున్నారు. నిజానికి ఈ సెకెండ్ వేవ్ లేకపోతే.. ఈ నెల మరికొన్ని క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అలరించేవి. ‘వకీల్ సాబ్’కి భయపడకుండా, వారం తరువాత తమ సినిమా వస్తుందని రిలీజ్ డేట్ ని కూడా గ్రాండ్ గా ప్రకటించుకున్నారు ‘లవ్ స్టోరీ’ మేకర్స్.

    ఇలాగే ‘టక్ జగదీష్’, ఆ వెంటనే.. తలైవి, ఆ తరువాత ఒక వారం గ్యాప్ లో ‘విరాట పర్వం’, ‘పాగల్’ ఇలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలే ఉన్నాయి ఈ నెల. కానీ ఒక్క వారంలోనే అంతా మారిపోయింది. థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ అలా కనిపించి.. ఇలా మాయమైపోయినట్టు కనిపిస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ వంటి పెద్ద సినిమాకే ఫ్యామిలీ ప్రేక్షకుల అటెండెన్స్ పెద్దగా కనిపించడం లేదనేది ట్రేడ్ వర్గాల మాట. కానీ, పవన్ ఫ్యాన్స్ పుణ్యమా అంటూ వకీల్ సాబ్ కి ఎక్కడా కలెక్షన్స్ తగ్గలేదు.

    పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.. ఫ్యాన్స్ కానీ మిగిలిన యూత్ కూడా థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేశారు. అదే నాగ చైతన్య సినిమాకి అలా వస్తారా అంటే డౌటే. అందుకే, అందరి కన్నా ముందే విషయం అర్ధం చేసుకున్న లవ్ స్టోరీ బృందం మొత్తానికి రేసులో నుండి తప్పుకుంది. అలాగే మిగిలిన సినిమాల మేకర్స్ కూడా… ఈ టైంలో తమ సినిమాలకు అస్సలు బోణి ఉండదని భయపడి వెనక్కి తగ్గారు. మొత్తంగా ‘మే’ మొదటి వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చు. అయితే ‘ఇష్క్’ వంటి చిన్న సినిమాలు థియేటర్ల ముఖం చూసినా.. ఆ సినిమాల ముఖం ఆడియన్స్ చూస్తారని నమ్మకం లేదు.