
Jammu And Kashmir: ‘‘త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు ఇటీవల లాల్ చౌక్‌కు వచ్చిన వారు ఈరోజు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలా తిరుగుతున్నారో చూసి ఉంటారు. 90వ దశకంలో నేనూ కశ్మీర్ వెళ్లాను. లాల్ చౌక్‌లో జెండాను ఎగురవేయాలని తీర్మానం చేయడంతో తీవ్రవాదులు నాకు నిరసనగా పోస్టర్లు వేశారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేకుండా వచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని నేను వారికి చెప్పాను. కానీ నేడు అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఈరోజు జమ్మూ కాశ్మీర్‌లో ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకం కార్యక్రమం విజయవంతమవుతోంది. ఈ రోజు శాంతి, ప్రశాంతత స్థాపించబడింది. జమ్మూ కాశ్మీర్‌పై కూడా ఇక్కడ చర్చ జరిగింది.. అక్కడ పర్యటించి ఇప్పుడే వచ్చిన వారు. మీరు అక్కడికి ఎంత సునాయాసంగా వెళ్లగలిగారో చూసి ఉండాలి’’ ఇవీ ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించార
Also Read: Hyper Aadi: పవన్ కళ్యాణ్ కావాలా? ఢీ కావాలా? అని అడిగారు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్
కశ్మీర్‌కు స్వేచ్ఛావాయువులు..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని సాకుగా చూపుతూ భారత్‌తో సంబంధమే లేదన్నుటా కశ్మీర్ పాలకులు, దేశాన్ని పాలించిన నేతలు 1990 వరకువ్యవహించారు. ఈ సమయంలో పెరిగిన ఉగ్రవాదం, సైనికులపై ఉగ్రవాదులు దాడిచేసిన ఘటనలు, ప్రజలు భయంభయంగా జీవనం సాగించడం వంటి ఘటనలు ప్రధాని మోదీని కలచివేశాయి. అందుకే ఆయన కశ్మీర్‌కు స్వేచ్ఛావాయువులు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆర్టిక్ 370 రద్దు.. భారీ ప్యాకేజీ..
జమ్ము కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశారు. జమ్ము–కాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిన ప్రాంతంగా, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. జమ్ము కాశ్మీర్‌కు ఉన్న భౌగోళిక.. రాజకీయ పరిస్థితులను ఒక్క నిర్ణయంతో మార్చేసిన మోదీ మరో కీలయ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆర్టికల్ 370, 35ఏ కారణంగా ఏ ఒక్కరూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం లేకుండా పోయింది. ఆర్టికల్ 370 రద్దు ద్వారా కొత్తగా పెట్టుబడులకు జమ్ము కాశ్మీర్‌లో అవకాశం కల్పించే విధంగా నూతన పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా జమ్ము కాశ్మీర్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ కూడా ప్రకటించింది.
శాంతిభద్రతలు మెరుగు..
2019, ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35ఏని కేంద్రం రద్దు చేసింది. మూడు సంవత్సరాల తరువాత, 2016–2018 2019–2021 మధ్య హోం శాఖ నమోదు చేసిన డేటాను పోల్చి చూస్తే, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో భద్రత గణనీయంగా మెరుగుపడింది. రెండు మూడు సంవత్సరాల కాలాలను పోల్చి చూస్తే, తీవ్రవాద సంబంధిత సంఘటనలు 21 శాతం తగ్గుదలని చూపించాయి. జూలై 31, 2022 నాటికి, కాశ్మీర్ మరియు జమ్మూ జోన్లలో 166 మంది ఉగ్రవాదులు (86 మంది స్థానికులు మరియు 80 మంది విదేశీ పౌరులు) చురుకుగా ఉన్నారు. 2021 సంవత్సరంలో 44 మంది, 2022లో 18 మంది టాప్ టెర్రర్ కమాండర్లు హతమయ్యారు.

ఆస్తులు కొనవచ్చు..
జమ్ము కశ్మీర్, లడక్ ఇప్పుడు కంద్రపాతిల ప్రాంతాలు రాష్ట్రం వెలుపల ఉన్న దేశంలోని పౌరులు ఎవరైనా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తిని కొనుగోలు చేయవచ్చు.
– ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కాశ్మీర్‌కు సొంత జెండా ఉంది. అక్కడి ప్రభుత్వ కార్యాలయాల్లో భారత జెండాతోపాటు జమ్మూ కాశ్మీర్ జెండాను కూడా ఉపయోగించారు. కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ప్రత్యేక జెండా ఉండదు. అంటే జాతీయ జెండా త్రివర్ణ పతాకంగానే ఉంటుంది.
– ఆర్టికల్ 370 ప్రకారం, రక్షణ, విదేశీ వ్యవహారాలు మరియు కమ్యూనికేషన్ మినహా మరే ఇతర విషయాలలో జమ్మూ మరియు కాశ్మీర్ కోసం చట్టాలు చేసే హక్కు దేశ పార్లమెంటుకు లేదు. అలాగే, జమ్మూ కాశ్మీర్‌కు స్వంత ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి అనుమతించబడింది. అయితే ఇప్పుడు ఇదంతా మారిపోయింది. గవర్నర్ కార్యాలయం రద్దు, గవర్నర్ పదవి ముగుస్తుంది. దీంతో పాటు రాష్ట్ర పోలీసులు కేంద్రం పరిధిలోనే ఉంటారన్నారు.
సెక్షన్ 356 వర్తించదు..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి లేదు. అంటే అక్కడ రాష్ట్రపతి పాలన లేదు, గవర్నర్ పాలన. అయితే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం కానుండడంతో ఇప్పుడు పరిస్థితి కూడా మారిపోయింది.
ద్వంద్వ పౌరసత్వానికి ముగింపు..
జమ్మూ కాశ్మీర్‌లో ఇకపై ద్వంద్వ పౌరసత్వం ఉండదు. ఆర్టికల్ 370 ప్రకారం, జమ్మూ కాశ్మీర్‌లో ఓటు హక్కు అక్కడి శాశ్వత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఓటు వేయలేరు, ఎన్నికలలో అభ్యర్థులు కాలేరు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం తర్వాత, భారతదేశంలోని ఏ పౌరుడైనా అక్కడ ఓటరుగా మరియు అభ్యర్థిగా మారవచ్చు.
మొత్తంగా దేశంలో ఎవరైనా ఎలాంటి అనుమతి లేకుండా జమ్మూ కశ్మీర్‌కు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం కలిగింది. ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. అల్లర్లు తగ్గాయి. 90వ దశకంలో ఉన్న పరిస్థితి ఉప్పుడు పూర్తిగా మారిపోయింది. మోదీ చెప్పినట్లు బుల్లెట్ ప్రూఫ్ లేకుండా వెళ్లి కశ్మీర్‌లో జాతీయ పతాకం ఎగురవేసేలా పరిస్థితులు మారిపోయాయి.
Also Read:Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం ఫిబ్రవరి 17న ప్రారంభం.. ఆ రోజే ఎందుకంటే ?