
Payal Rajput: జయాపజయాలతో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ కి యూత్ లో భారీ ఇమేజ్ ఉంది. 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీతో పాయల్ టాలీవుడ్ లో అడుగుపెట్టారు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ ఎక్స్ 100 పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కార్తికేయ హీరోగా నటించిన ట్రాజిక్ లవ్ డ్రామా యువతకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఆర్ఎక్స్ 100 మూవీ విజయంలో పాయల్ గ్లామర్ కూడా కీలక పాత్ర పోషించింది. హీరో కార్తికేయతో మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించింది. పాయల్ కొన్నాళ్ల పాటు కుర్రాళ్ళ మనసుల్లో నుండి పోలేదంటే అతిశయోక్తి కాదు.
ఆర్ఎక్స్ 100తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కానీ… ఆ టెంపో కొనసాగించలేకపోయింది. ఆ స్థాయి విజయం మళ్ళీ పాయల్ ఖాతాలో పడలేదు. వరుస ప్లాప్ ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేశాయి. విచిత్రంగా ఆర్ఎక్స్ 100 విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. బహుశా ఆమెది నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్ కావడం కారణం కావచ్చు. RDX లవ్ టైటిల్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసింది.ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
పాయల్ కి వచ్చిన చెప్పుకోదగ్గ ఆఫర్స్ వెంకీ మామ, డిస్కోరాజా. ఈ రెండు చిత్రాల్లో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించారు.వెంకటేష్, నాగ చైతన్యల మల్టీస్టారర్ వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. రవితేజ నటించిన డిస్కో రాజా డిజాస్టర్ అయ్యింది. ఆ దెబ్బతో కనీసం టైర్ టూ హీరోలు కూడా పట్టించుకోవడం మానేశారు. ఇక చేసేది లేక డిజిటల్ మూవీస్ చేసుకుంటుంది. గత ఏడాది తీస్ మాస్ ఖాన్, జిన్నా చిత్రాల్లో నటించారు. ఇవి రెండు డిజాస్టర్స్ అయ్యాయి.

తెలుగులో ఆమె కెరీర్ కి తెరపడినట్టే. ఈ క్రమంలో ఇతర పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. హెడ్ బుష్ టైటిల్ తో ఓ కన్నడ చిత్రం చేశారు. ప్రస్తుతం గోల్ మాల్ అనే ఒక తమిళ చిత్రం చేస్తున్నారు. మరి కోలీవుడ్, శాండిల్ వుడ్ లలో అయినా పాయల్ హీరోయిన్ గా ఓ స్థాయికి వెళుతుందేమో చూడాలి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతున్నారు. తాజాగా షార్ట్ ఫ్రాక్ ధరించి బోల్డ్ ఫోజులో టెంపరేచర్ పెంచేసింది. ఆ డ్రెస్సులో పాయల్ ఇటు తిరిగితే పరిస్థితి ఏంటని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాయల్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది.
Also Read: Rahul- Gill: ఫామ్‌లేని ప్లేయర్‌కు టీమిండియాలో స్థానం.. సెంచరీల హీరోకు అన్యాయం..
View this post on Instagram