
Criminal Atiq Ahmhed : “అతిక్ హతమారిపోవడం ఓ నరకాసుర వధ.. ఉత్తర ప్రదేశ్ లో మరో దీపావళి” ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట ఇది. రాజకీయ నాయకుడిగా మారిన డాన్ గా రూపాంతరం చెందిన అతీక్ అహ్మద్.. కరుడుగట్టిన నేరస్థుడు. మాజీ ఎంపీగా, ఎమ్మెల్యే అయిన ఇతడి పై అనేక కేసులు ఉన్నాయి. వందకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ ఇతగాడు చట్టసభలకు ఎంపికయ్యాడు అంటే యూపీ ఓటర్లకు ఒక దండం పెట్టాలి. వాస్తవానికి అహ్మద్ 40 ఏళ్ళ కిందటే ఒక హత్యాయత్నం కేసులో మొదటిసారి పోలీసు రికార్డుల్లోకి ఎక్కింది. తర్వాత ఐదు సంవత్సరాలకు 1989లో అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయినప్పటికీ ఇతడి నేరాలు ఏమాత్రం తగ్గు ముఖం పట్టలేదు. 2005లో బహుజన్ సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య కేసులో అహ్మద్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24 న హత్యకు గురయ్యాడు. అప్పుడు రాజు పాల్ ను ఎలా అయితే హత్య చేశారో..ఉమేష్ పాల్ ను కూడా అలానే హతమార్చారు.. అంటే అహ్మద్ పగబడితే ఎలా ఉంటుందో శాంపిల్ గా చూపించారు..
వాస్తవానికి అతిక్ కు ఉమేష్ పాల్ ను చంపడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని పోలీసులు చెబుతున్నారు. కానీ ప్రజల్లో తామంటే భయం ఉండాలని వారు హత్య చేసినట్టు తెలుస్తోంది. జైల్లో ఉన్నప్పుడు కూడా అతిక్ దందాలు ఆగలేదు. 2018లో మోహిత్ జైస్వాల్ అనే వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి జైలులో ఉన్న అతీక్ దగ్గరికి తీసుకెళ్లారంటే, అతడి పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జైలులో ఉన్న అతీక్ జైశ్వాల్ ను బెదిరించి 45 కోట్ల విలువైన ఆస్తులను బలవంతంగా తన అనుచరుల పేరు మీద బదిలీ చేస్తూ డాక్యుమెంట్లపై అతీక్ సంతకం చేయించుకున్నాడు.. 2019 నుంచి గుజరాత్ సబర్మతి జైల్లో ఉన్న అతీక్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు కొన్నాళ్ల కిందట ప్రయాగ్ రాజ్ తీసుకొచ్చారు. ఇక అతీక్ తమ్ముడు ఆశ్రఫ్ పై 52 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అతడు బరేలి జైలులో ఉన్నాడు. అతీ క్ కు ఐదు కొడుకులు ఉన్నారు.. వీరిలో ఇద్దరు కొడుకులు జైల్లో ఉన్నారు. మైనర్లు అయిన చివరి ఇద్దరు కొడుకులు జువైనల్ హోమ్ లో ఉన్నారు. ఒక కొడుకు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతిక్ భార్య పర్వీన్ పై కూడా కేసులు ఉన్నాయి. అయితే ఆమె పరారీలో ఉంది.
లతీక్ కేవలం గ్యాంగ్ స్టర్ మాత్రమే కాదు. ఐ ఎస్ ఐ లష్కరే తోయిబా ఆప్తమిత్రుడు. ఏ మీడియా వల్ల అయితే తాను బతికి ఉన్నానని చెప్పుకున్నాడో.. ఆ మీడియా ఎదుటే ఫేక్ మీడియా ఐడి కార్డులు వేసుకున్న హంతకుల చేతిలో క్లోజ్ రేంజ్ లో హత్యకు గురయ్యాడు. ఒక క్రైమ్ సినిమాను పోలిన ఈ సంఘటన మొత్తం మీడియాలో రికార్డు అయిపోయింది. సమయంలో ఇలాంటి ఆరాచకశక్తులకు, వీటికి అండగా నిలిచే పార్టీలకు, భక్తితో, ఎంతో మద్దతు పలికిన మీడియా ఇంకా షాక్ లోనే ఉంది. అతీక్ హతమారిపోయిన తర్వాత ఇక ఉత్తర ప్రదేశ్ లో నేరమయ సామ్రాజ్యానికి తెరపడినట్టేనా? మాఫియాను తుద ముట్టించడమే తన సంకల్పంగా చెప్పుకుంటున్న యోగి బాబా నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో అతిక్ వంటి వారు చాలామంది ఉన్నారు. నెత్తి మాసిన సమాజ్వాది పార్టీ పెంచి పోషించిన విషవృక్షాల కొమ్మలు మాత్రమే యోగి నారికాడు. ఆ చెట్టు వేళ్ళ జోలికి పోలేదు. కానీ ఇకనుంచి అది మొదలవుతుంది.
కానీ ఇలాంటి అప్పుడే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసే వ్యాఖ్యలు పుట్టిస్తున్నాయి. ఇతడు చెప్పేది ఏంటయ్యా అంటే ఆతీక్, అతడి సోదరుడు హత్యకు గురైన నేపథ్యంలో, బాధ్యత వహిస్తూ యోగి రాజీనామా చేయాలట.. ఇదే ఓవైసీ ఉమేష్ పాల్, రాజ్ పాల్ హత్యలు జరుగుతే నోట్లో ఏం పెట్టుకున్నాడో? ఒక్కొక్కడు ఈ దేశంలో భలే మోపయ్యారు. అయితే 11 ఎన్కౌంటర్లు చేయించిన యోగి కావాలనుకుంటే అతీక్ ను మెడికల్ చెకప్ కోసం తీసుకొచ్చినప్పుడు అక్కడే ఖతం చేసేది. హఠాత్తుగా ఫేక్ మీడియా ఐడి కార్డులు వేసుకొని ఈ కొత్త హంతకులు ఎక్కడి నుంచి ఊడి పడ్డారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. పాత కక్షలు అని చెబుతున్నప్పటికీ అవి నమ్మేలా లేవు.
గతంలో ఈ అతీక్ కు సమాజ్వాది పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆయను ఏకంగా పార్లమెంటుకు పంపించింది.. ఒకానొక సందర్భంలో సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అతీక్ ఇంటికి వస్తే.. తన పెంపుడు కుక్కతో మూలయం సింగ్ యాదవ్ కు షేక్ హ్యాండ్ ఇప్పించాడు. అది చూసేందుకు సరదా ఫోటో అయినప్పటికీ.. ఎవడైనా సరే మా చెప్పు చేతల్లో ఉండాల్సిందే అని అతీక్ సంకేతం ఇచ్చాడు. నేరాల్ని, రాజకీయాలను కలగలిపి, సిగ్గు శరం వదిలేసిన ఎస్పీ పార్టీ ఇప్పుడు.. అతీక్ మీద సానుభూతి ఒలకబోస్తోంది. ఇంతకుమించిన దారిద్రం ఇంకేం ఉంటుంది. ఇలాంటి వారితోనే బంగారు తెలంగాణ సారధి కేసీఆర్ అంట కాగుతున్నాడు.
ఇప్పుడు సోషల్ మీడియాలో తాజాగా జరుగుతున్న చర్చ ఏందయ్యా అంటే.. మూలయం సింగ్ కు తన కుక్క ద్వారా షేక్ హ్యాండ్ ఇచ్చిన అతీక్ మన వ్యవస్థను ఒక చీడపురుగులా చూశాడు. అంతేకాదు ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం పెట్టుకున్నాడు. లష్కరే గ్రూపుతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగాడు. చివరికి ఐఎస్ఐ ఇచ్చిన ఆయుధాలతో మనుషులను చంపడం మొదలుపెట్టాడు. ఇలాంటి వెధవను గుర్తు తెలియని వ్యక్తులు చంపడమే సరయిందని యూపీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నరకాసుర వధ సందర్భంగా మొత్తం దీపావళి చేసుకుంటున్నారు. ఇక కొంతమంది ఉదారవాదులు, ఎడమ చేతి వాటం వాళ్లు కొన్ని కీలక విషయాలను మర్చిపోతున్నారు. అదే సమయంలో దేశానికి కీడు కలిగించే వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారు. వ్యవస్థను కుక్కతో పోల్చిన వ్యక్తి బజారులో కుక్క చావు చచ్చాడు. అందుకే గతంలో మూలయం సింగ్ యాదవ్ కు లతీక్ తన కుక్కతో షేక్ హ్యాండ్ ఇప్పించిన ఫోటో ఇప్పుడు సామాజిక మధ్యమ లో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఒక రాజ సన్యాసి సమాజం పట్ల ఎంత కఠినంగా ఉంటాడో, సంఘ విద్రోహశక్తులను మట్టిలో ఎలా కలిపేస్తాడు యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు చూపిస్తున్నాడు. అందుకే యోగి దేశ ప్రధాని కావాలి అనే డిమాండ్ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యక్తమవుతోంది. సరే దీనికి ఎవరు అడ్డుపడతారో, ఎవరు సమర్థిస్తారో తెలియదు గాని.. ఒకటి మాత్రం నిజం న్యాయవ్యవస్థ ఫెయిల్ అవుతున్న కేసులో.. యోగి ప్రభుత్వం తుపాకీతో చార్జి తీసుకుంటుంది. వ్యవస్థకు పట్టిన మకిలిని వాషింగ్ పౌడర్ నిర్మా తో శుభ్రం చేస్తోంది.