
CM Yogi Adityanth : సమాజ్వాది పార్టీ చేరదీసింది. బహుజన్ సమాజ్వాది పార్టీ పెంచి పోషించింది. ఫలితంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గుండా రాజ్ అయ్యింది. 20 కోట్ల ప్రజలకు వారు చెప్పిందే వేదం అయింది. దౌర్జన్యాలు, దోపిడీలు షరామాములయ్యాయి. అక్రమాలు దర్జాగా సాగిపోయాయి. ఇలాంటప్పుడే యోగి ఆదిత్యనాథ్ 2017లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు మొదలు ఇప్పటిదాకా ఉత్తర ప్రదేశ్ లో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న గుండాలకు సరైన శిక్ష విధిస్తున్నారు. బుల్డోజర్ బాబా అంటే ఏంటో చేతల్లో నిరూపిస్తున్నాడు.
శనివారం ముగ్గురు దుండగుల కాల్పుల్లో హతమైన అతీక్ పేరు మోసిన గ్యాంగ్ స్టర్, కరుడుగట్టిన నేరస్థుడు. ఇతని ఐదుగురు కొడుకులు కూడా నేరమయ సామ్రాజ్యంలో తండ్రికి సహకరించేవారు. అలా చాలామంది అమాయకులను చంపేశారు. అతీక్ అహ్మద్ పై 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. తన కంటి చూపుతో ఇతడు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసించేవాడు. పైగా ఇతడికి సమాజ్వాది పార్టీ అండదండ ఉండడంతో రెచ్చిపోయేవాడు. ఇటువంటి కరుడుగట్టిన నేరస్థుడికి ఆ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేరగాళ్లు ఉత్తరప్రదేశ్లో కోకొల్లలుగా ఉన్నారు. ఇలాంటి వారి భరతాన్ని యోగి పడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గ్యాంగ్ స్టర్లు రాసిన రక్త చరిత్రను యోగి తుపాకితో తూడ్చేస్తున్నాడు.
తన హయాంలో ఇప్పటివరకు 10,900 ఎన్ కౌంటర్లు జరిగాయి అంటే యోగి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో 183 మంది క్రిమినల్స్ హతమయ్యారు. 23,300 మంది నేరగాళ్ళను అరెస్టు చేశారు. వీరిలో 5,046 మంది గాయాలతో పట్టుబడ్డారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చు. ఇక ఆయా ఎన్కౌంటర్లలో 144 మంది పోలీసులు గాయపడ్డారు. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది గ్యాంగ్ స్టర్ దూబే అనుచరులు కాన్పూర్ లో చేసిన దాడిలోనే చనిపోయారు.
ఇక ప్రయాగ్ రాజ్ ఉమేష్ పాల్ హత్య తర్వాత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికి పోయింది. యోగి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న యోగి ప్రభుత్వం .. శాసనసభలో అక్రమార్కులందరినీ మట్టిలో కల్పిస్తా అంటూ ఛాలెంజ్ చేసింది. అన్నట్టుగానే ఉమేష్ పాల్ కేసులో కీలక పాత్ర పోషించిన అతీక్ అహ్మద్, అతడి ఇద్దరి కొడుకుల్ని భూమి మీద లేకుండా చేసింది. 50 రోజుల్లో అతడి గుండా రాజ్ ఖతం అయిపోయింది. దీంతో ఉత్తరప్రదేశ్ వాసులు పండగ చేసుకుంటున్నారు. నెటిజన్లు అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.. అతీక్, అతడి కుమారుడు ఆశ్రఫ్ హత్య తర్వాత యూపీ లో గుండా రాజ్ అంతమైందని వ్యాఖ్యానిస్తున్నారు..ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ ఘటన తాలూకు విషయాలు ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ గా నిలిచాయి.
Remembering this man words once again.
Hum UP ke log🔥🔥#AtiqueAhmed #Prayagraj #YogiAdityanath #AshrafAhmed #AtiqAhmed pic.twitter.com/okCUpOuLQB— chandu (@Chandu_Patel1) April 15, 2023