జగన్ ప్రతీకారానికి గల్లా జయదేవ్ బలి

రాయలసీమ రెడ్డప్పల ప్రతీకారమే వేరప్పా అని అందరూ కథలు కథలుగా చెబుతుంటారు. టీడీపీ తొలి ప్రభుత్వంలో ఊగిపోయిన గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఇప్పుడు గట్టిగానే దెబ్బ పడింది. టీడీపీ ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆయనపై ప్రతీకారం మొదలైంది. జగన్ ను, విజయసాయిరెడ్డి గురించి పార్లమెంట్ లో పరుషంగా మాట్లాడిన గల్లా జయదేవ్ కు చెందిన ప్రధాన కంపెనీ ‘అమరరాజా’ను మూసివేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 10వేల కోట్లు విలువైన […]

Written By: NARESH, Updated On : May 2, 2021 8:39 am
Follow us on

రాయలసీమ రెడ్డప్పల ప్రతీకారమే వేరప్పా అని అందరూ కథలు కథలుగా చెబుతుంటారు. టీడీపీ తొలి ప్రభుత్వంలో ఊగిపోయిన గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఇప్పుడు గట్టిగానే దెబ్బ పడింది. టీడీపీ ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆయనపై ప్రతీకారం మొదలైంది. జగన్ ను, విజయసాయిరెడ్డి గురించి పార్లమెంట్ లో పరుషంగా మాట్లాడిన గల్లా జయదేవ్ కు చెందిన ప్రధాన కంపెనీ ‘అమరరాజా’ను మూసివేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 10వేల కోట్లు విలువైన ప్రపంచ ప్రఖ్యాత ఈ కంపెనీలో ప్రత్యక్షంగా 20వేల మంది పరోక్షంగా 50వేల మంది ఆధారపడి బతుకున్నారు. ఇంత పెద్ద కంపెనీని జగన్ సర్కార్ మూసివేయడం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ సీఎం జగన్ ప్రతీకారం మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో నెలకొల్పిన దేశంలోనే ప్రముఖ పాపులర్ బ్యాటరీ కంపెనీ ‘అమరోన్’ అమరరాజా ను జగన్ ప్రభుత్వం మూసివేయించింది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి, దేవీనేని ఉమలను కేసుల ఉచ్చుల్లో బిగించిన ఏపీ సర్కార్ ఇప్పుడు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆయువు పట్టు అయిన దేశంలోనే పెద్ద బ్యాటరీ కంపెనీ ‘అమరరాజా’పై పడింది.

తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ కంపెనీని మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శనివారం నుంచి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కంపెనీకి విద్యుత్ సరఫరా ఆపేయడంతో ఉత్పత్తి మొత్తం నిలిచిపోయింది.

ఈ అతిపెద్ద బ్యాటరీ కంపెనీ మూతపడడంతో ప్రత్యక్షంగా 20వేల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో 50వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. మూసివేయాలని ఏపీ సర్కార్ నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఇంత మంది ఉపాధి లేక ఆందోళన వ్యక్తమవుతోంది.

అమరరాజా బ్యాటరీస్ వల్ల అక్కడ గాలిలో, మట్టిలో సీసం పరిమాణం నిర్ధేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సర్వేలో తేలింది. అక్కడ పనిచేసే ఉద్యోగులు.. సమీప గ్రామాల ప్రజల్లోనూ సీసం పరిమాణం ఎక్కువ ఉంది. దీంతో వారి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మూర్చ వచ్చిచనిపోయిన సందర్బాలు ఉన్నాయి. దీంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యాక్టరీని మూసివేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.