https://oktelugu.com/

ఏదో అనుకుంటే మరేదో చేశారు..: నిమ్మగడ్డ నిర్ణయంపై విపక్షాల ఫైర్‌‌

ఏపీ ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ తాను అనుకున్న పనిని తాను చేస్తూ వెళ్లిపోతున్నారు. తాను పదవిలో ఉన్నప్పుడే రాష్ట్రంలో అన్ని ఎన్నికలు కంప్లీట్‌ చేయాలనే దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు. అందుకు తగినట్లుగానే తన పంథాను కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం అడ్డుపడుతున్నా.. తాను ఆగేది లేదంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఓ వైపు రాష్ట్రంలో స్థానిక సంస్థలు కొనసాగుతుండగానే అటు మున్సిపల్‌ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసేశారు. Also Read: ‘సోము’.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 16, 2021 / 09:51 AM IST
    Follow us on


    ఏపీ ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ తాను అనుకున్న పనిని తాను చేస్తూ వెళ్లిపోతున్నారు. తాను పదవిలో ఉన్నప్పుడే రాష్ట్రంలో అన్ని ఎన్నికలు కంప్లీట్‌ చేయాలనే దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు. అందుకు తగినట్లుగానే తన పంథాను కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం అడ్డుపడుతున్నా.. తాను ఆగేది లేదంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఓ వైపు రాష్ట్రంలో స్థానిక సంస్థలు కొనసాగుతుండగానే అటు మున్సిపల్‌ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసేశారు.

    Also Read: ‘సోము’.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చేనా..?

    రాష్ట్రంలో మొత్తం 12 కార్పొరేషన్లకు, 75 మున్సిపాలిటీలకు వచ్చే నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి ఊహించిన విధంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఈ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వడంపై విపక్షాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌‌కు న్యాయస్థానాల్లో వరుస దెబ్బలు తగులుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఇచ్చిన ఉత్తర్వులపై కూడా హైకోర్టు నుంచి అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. తాజాగా రేషన్ వాహనాల విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది.

    గతేడాది మార్చిలో కరోనా కారణంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేశారు. అప్పడు నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. బెదిరింపులు చేసి నామినేషన్లు వేయనివ్వకుండా అధికార వైసీపీ అడ్డుకుంటోందని విపక్ష నేతలు సైతం ఆరోపించారు. కొత్తగా షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. నామినేషన్లకు అవకాశమిస్తే ఈసారి తమ పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశముంటుందని చెబుతున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం రీ నోటిఫికేషన్ ఇచ్చారు.

    Also Read: స్వస్థలాలకు మంత్రుల పరుగులు

    దీంతో స్క్రూటినీ నుంచి ఇప్పడు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వం కూడా మున్సిపల్ ఎన్నికలకు ఓకే చెప్పడంతో ఎన్నికల కమిషన్ పదిహేను రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేలా రీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విపక్షాలు మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. నోటిఫికేషన్‌ రిలీజ్‌తో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో సందడిగా ఉన్న పల్లెలు, మున్సిపల్ ఎన్నికలతో పట్టణాలు కూడా సందడిగా మారనున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్