మహేష్ ‘సర్కారి వారి పాట’ నుంచి సర్ ప్రైజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు విలక్షణ కథాంశంతో వస్తున్న చిత్రం ‘సర్కారి వారి పాట’. సరికొత్త గెటప్ లో ఇందులో నటిస్తున్నారు. పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో సాగుతోంది. కీర్తి సురేష్ కథనాయికగా నటిస్తోంది. ప్రస్తుతం దుబాయ్ , సౌదీ ఎడారుల్లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. మహేష్ బాబు ఫ్యామిలీతో దుబాయ్ లో ఉంటున్నాడు. ఈనెల 21న ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆ రోజే చిత్ర బృందం దుబాయ్ […]

Written By: NARESH, Updated On : February 16, 2021 8:48 am
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు విలక్షణ కథాంశంతో వస్తున్న చిత్రం ‘సర్కారి వారి పాట’. సరికొత్త గెటప్ లో ఇందులో నటిస్తున్నారు. పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో సాగుతోంది. కీర్తి సురేష్ కథనాయికగా నటిస్తోంది.

ప్రస్తుతం దుబాయ్ , సౌదీ ఎడారుల్లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. మహేష్ బాబు ఫ్యామిలీతో దుబాయ్ లో ఉంటున్నాడు. ఈనెల 21న ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆ రోజే చిత్ర బృందం దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేస్తుంది.

అనంతరం కొంచెం గ్యాప్ ఇచ్చి కొత్త సినిమా షెడ్యూల్ ను మొదలు పెడుతారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఓ చిన్న సర్ ప్రైజ్ రాబోతోందట.. 21న దుబాయ్ షెడ్యూల్ ముగియనున్న నేపథ్యంలో ఈ చిన్న టీజర్ ను.. లేదంటే దుబాయ్ షెడ్యూల్ వర్కింగ్ స్టిల్స్ తో ఓ వీడియోను డిజైన్ చేయిస్తున్నట్టు సమాచారం.

దీంతో ఖచ్చితంగా 21 తర్వాత ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి మహేష్ ఫ్యాన్స్ కు ఓ టీజర్ వీడియో రావడం ఖాయంగా కనిపిస్తోంది. 2002 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.